
ycp woman leader sacrificed her personal life for cm jagan
YS Jagan : సినిమా సెలబ్రిటీలకు ఎలా ఫ్యాన్స్ ఉంటారో రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందులో విచిత్రం ఏం లేదు. అయితే.. ఒక్కొక్కరు తమ అభిమాన వ్యక్తి మీద రకరకాలుగా ప్రేమను చూపిస్తుంటారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద ఓ మహిళ చూపిస్తున్న అభిమానాన్ని చూస్తే తట్టుకోలేం. ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. రాయలసీమ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ముస్లీం యువతి అప్పట్లోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసిందట. జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా?
అని చాలా మంది వెయిట్ చేశారు. వైసీపీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. చివరకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే మూడున్నరేళ్ల పదవీ కాలం కూడా అయిపోయింది. ఆయన గెలుపు కోసం ఎదురు చూసిన వాళ్లే కాదు.. ఆయన గెలుపు అహర్నిశలు కష్టపడ్డవారు కూడా ఉన్నారు. అందులో ఒకరు కర్నూలుకు చెందిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమీలా బేగం. నాకు జగనన్న అంటే పిచ్చి అభిమానం. ఆయనను సీఎంగా చూడాలనేదే నా కోరిక. అందుకోసం నేను వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం దాదాపు 12 ఏళ్ల పాటు కష్టపడ్డాను. పనిచేశాను.
ycp woman leader sacrificed her personal life for cm jagan
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరుపున ఎన్నో నిరాహార దీక్షలు చేశాను. లాఠీల దెబ్బలు తిన్నాను. కానీ.. జగనన్న అధికారంలోకి వచ్చాక.. నాలాంటి చాలామంది కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఆయన్ను కలిసే అవకాశం కూడా తమకు ఇవ్వడం లేదు.. అంటూ జమిలా బేగం చెప్పుకొచ్చారు. చివరకు సీఎం జగన్ ను కలుసుకొని తమ బాధలు చెప్పుకోవాలని అనుకున్నా.. ఆయన్ను కలవనీయడం లేదంటూ ఆమె వాపోయారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. మరి.. ఈ విషయం చివరకు జగనన్నకు తెలిసి అయినా ఆ మహిళను కలుస్తారో? లేదో కాలమే సమాధానం చెప్పాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.