Ys Sharmila : ఆ ఒక్క మాటతో జగన్ పరువు తీసేసిన వైఎస్ షర్మిల వీడియో వైరల్..!!
Ys Sharmila : తెలంగాణ రాజకీయాలలో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొలిటికల్ వ్యవహారం పెను దుమారాన్ని రేపుతూ ఉంది. పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో… సిట్ దర్యాప్తు ఆలస్యం కావటంపై ఇటీవల ఆమె తన ఇంటి వద్ద నుండి సిట్ కార్యాలయానికి బయలుదేరుతూ ఉండగా పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో పాటు తోపులాట జరగటంతో కొంతమంది పోలీసులపై షర్మిల చేయి చేసుకోవడంతో ఆమెపై కేసు నమోదు చేయడం తెలిసిందే.
Hijras Comments on Ys Sharmila
ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను చర్లపల్లి జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత షర్మిలకి బెయిల్ రావడం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఏపి ముఖ్యమంత్రి జగన్ గురుంచి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బయ్యారం గనుల ప్రస్తావన వచ్చిన విషయంలో… అసలు ఆ గనులకు సంబంధించి తనకి ఏమీ తెలియదని పేర్కొన్నారు. బయ్యారం గనుల ఆస్తుల వాటాలో తనకేమీ లేదని.. కావలిస్తే వెళ్లి జగన్ రెడ్డి అడిగి తెలుసుకోండి
Ys Sharmila Comments On Ys Jagan
అంటూ మీడియా సముకంగా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఊహించని విధంగా ఈ రీతిగా జగన్ పై షర్మిల వ్యాఖ్యలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో BRS పార్టీతో మొట్టమొదటి నుండి పోరాడుతున్నది తానేనని షర్మిల స్పష్టం చేసింది. బీజేపీ పార్టీతో కెసిఆర్ రహస్యంగా స్నేహం కొనసాగిస్తున్నారని ఆరోపించింది. ప్రజా సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని… ఎవరితో అయినా ఎందాకైనా పోరాడుతానని వైయస్ షర్మిల వ్యాఖ్యానించింది.
