Home » Andhra Pradesh » Ysrcp Alleges Ayyanna Patrudu Against Illegal Mining
andhra pradesh

Ayyanna Patrudu : బ్రేకింగ్ : అయ్యన్నపాత్రుడు అరెస్ట్!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 25, 2023, 9:00 pm
Advertisement

Ayyanna Patrudu : టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అసలు రంగురాళ్ల గురించి మాట్లాడే అర్హత అయ్యన్నపాత్రుడికి లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. అసలు రంగురాళ్ల ద్వారా తాను రూపాయి అయినా సంపాదించినట్టు నిరూపిస్తే.. తాను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

Advertisement

ysrcp alleges Ayyanna Patrudu against illegal mining

ఒకవేళ మీరు నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ అయ్యన్నపాత్రుడికి ఉమాశంకర్ సవాల్ విసిరారు.అసలు శ్రీరంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించిందే నువ్వు. నీ కొడుకు. పండుగలు, పబ్బాల పేరుతో రంగురాళ్ల వ్యాపారుల నుంచి లక్షలు దోచుకున్నదే మీరు. నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న అటవీ ఖనిజ సంపదను దోచుకున్నదే మీరు. అటవీ సంపదను కొల్లగొట్టిందే మీరు అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.

Advertisement

Ayyanna Patrudu : లేటరైట్ ను కొల్లగొట్టి కోట్లు సంపాదించింది మీరు కదా?

గత టీడీపీ హయాంలో సరుగుడులో లక్షల టన్నుల లేటరైట్ ను కొల్లగొట్టింది ఎవరు? కోట్లు సంపాదించింది ఎవరు.. మీరు మంత్రిగా ఉండి నర్సీపట్నాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు. అసలు సాలికమల్లవరంలో రంగురాళ్ల తవ్వకాలు జరగలేదు అని నేను చెప్పడం కాదు. అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం నాపై బురద జల్లుతున్నారా? ఆరిలోవ ప్రాంతంలో రంగు రాళ్ల తవ్వకాలు జరిపిందే టీడీపీ నేతలు. వాళ్లను అరెస్ట్ చేసిన విషయాన్ని అయ్యన్నపాత్రుడు కాస్త గుర్తు చేసుకుంటే మంచిది అంటూ ఎమ్మెల్యే ఉమాశంకర్ హితువు పలికారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి