Home » News » Ahmedabad Plane Crash
News

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. కన్నీరు పెట్టిస్తున్న గుడ్ బై ఇండియా అంటూ బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 12, 2025 6:39 pm
Advertisement

Ahmedabad Plane Crash : భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నిలిచింది. లండన్‌(London)కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘనినగర్ సమీపంలో కూలిపోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. విమానం ఒక్కసారిగా గాల్లో అదుపు కోల్పోయి చెట్టును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది…

Advertisement

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. కన్నీరు పెట్టిస్తున్న గుడ్ బై ఇండియా అంటూ బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో..!

Ahmedabad Plane Crash : గుడ్ బై ఇండియా అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న ప్రయాణికులు..శాశ్వతంగా వెళ్లిపోయారు

ఈ ప్రమాదానికి ముందు కొంతమంది బ్రిటీష్ ప్రయాణికులు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “గుడ్ బై ఇండియా” అంటూ సంతోషంగా, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వారు తీసుకున్నవీడియో..అదే వారికీ చివరిది కావడం అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది. విమానంలో ఎక్కిన అనంతరం తమ భారత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చిరునవ్వులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించిన వారిలో చాలామంది ఇక ఈ లోకంలో లేరనే వార్త బాధాకరం. ఆ ప్రయాణికులు వీడియోలో చూపించిన ఆనందం, ఉద్వేగం కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విషాదంలోకి మారిపోయింది. వారి చివరి సంభాషణలు ఇప్పుడు చూసేవారి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి.

Advertisement

ఈ ఘటన విమాన ప్రయాణాల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సెల్ఫీ వీడియోలు ద్వారా మిగతా ప్రయాణికుల భావోద్వేగాలు, చివరి క్షణాల ఆనందం ఇప్పుడు ప్రపంచానికి కనిపించేలా మారాయి. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ వారికోసం కనీసం మౌనంగా ప్రార్థించకమానరు. ఒకప్పుడు మంచి జ్ఞాపకాల కోసం తీసిన వీడియోలు.. ఇప్పుడు ఏవ్ జ్ఞాపకాలుగా మారిపోవడం ఎంతటి విషాదమో చెప్పలేం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి