Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు - 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటన..?
Ahmedabad Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. టేకాఫ్ అయినా కొద్దీ నిమిషాల్లోనే రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలింది. ఈ ప్రమాద మరణాలపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేటెడ్ ప్రెస్ (AP) అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో తెలిపారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఈ విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.
Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటన..?
మృతుల్లో కొందరు స్థానికులు కూడా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘనినగర్ సమీపంలో విమానం కూలిపోయింది. ప్రమాదం తీవ్రతకు తగిన సూచనగా మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా కాలిబూడిదైపోయింది. శరీరాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి.
ఇప్పటికే ఘటనాస్థలికి అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రులకు తరలించే పనులు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రి, PMO అధికారులు దీనిపై సమీక్ష చేస్తున్నారు. విమాన ప్రమాదానికి గల అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.