Liquor Bottle : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. నూతన మద్యం విధానం కూడా రేపటి నుండి అమలు కానుంది. నూతన విధానంలో బ్రాండెండ్ మద్యం అందుబాటులోకి రానుంది. అలాగే క్వార్టర్ రూ.99 లకే నాణ్యమైన మద్యం అందిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి ఏపీవాసులకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిచాయి. ఇక నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులు నిర్వహిస్తారు. లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు.
99కే క్వార్టర్ బాటిల్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ సప్లై చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తొలుత 2 లక్షల కేసులు తీసుకోబోతున్నారు. అనంతరం మందుబాబుల స్పందన చూసి తర్వాత స్టాక్ కు ఆర్డర్ పెట్టబోతున్నారు. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించాం. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తాం. అన్ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది అని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకర్లకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 3396 మద్యం దుకాణాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం వరకూ కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇక 3,396 మద్యం షాపులకు గానూ 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు రుసుము రూపంలో రూ.2 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. ఈ ప్రకారం 89,882 దరఖాస్తులకు గానూ ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 లిక్కర్ షాపులకు 5764 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు అనంతపురం జిల్లాలోని 12 లిక్కర్ షాపులకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని ఎక్సైజ్ శాఖ అధికారులు పునఃపరిశీలించాలని భావిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.