Home » News » Army Jawan Sachin Yadavrao Vananje Dies
News

Sachin Yadavrao Vananje : దేశం కోసం ప్రాణాలు విడిచిన మరో సైనికుడు..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 10, 2025 4:50 pm
Advertisement

Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన ఈ యోధుడు మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందినవాడు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మురళీనాయక్ కాల్పుల్లో అమరుడవడం, ఇప్పుడు మరో తెలుగు ప్రాంతానికి దగ్గరైన సచిన్ వనాంజే ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

Advertisement

Sachin Yadavrao Vananje : దేశం కోసం ప్రాణాలు విడిచిన మరో సైనికుడు..!

Sachin Yadavrao Vananje : మరో జవాన్ వీరమరణం

సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహాన్ని ఇవాళ స్వగ్రామానికి తీసుకురానున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. అతని వీరమరణం దేశ ప్రజల గుండెలను కలిచివేసింది. చిన్నతనంలోనే దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరిన సచిన్, తన విధిని చివరి శ్వాస వరకు నిర్వర్తించాడు. కుటుంబంలో ఆశాజ్యోతి అయిన ఈ జవాన్ మృతిచెందడం తల్లిదండ్రులకు, బంధువులకు తీరని లోటుగా మిగిలింది.

Advertisement

ఈ కాల్పుల్లో జవాన్‌తో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరంగా మారింది. వీర జవాన్‌కు దేశం తలవంచి నివాళులు అర్పిస్తోంది. సచిన్ వంటి యువ సైనికుల త్యాగం దేశ భద్రతకు మూలస్తంభంగా నిలుస్తుంది.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి