Snake : ఇదేం దారుణం.. కర్రీ పఫ్‌లో పాము పిల్ల కనిపించే సరికి..!
Snake : మహబూబ్‌నగర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న కర్రీపఫ్‌లో పాము పిల్ల కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక మహిళ జడ్చర్ల లోని ఒక బేకరీకి వచ్చింది. అక్కడ ఒక కర్రీ పఫ్‌ను ఆర్డర్ చేసింది. వెంటనే వెయిటర్ ఆమెకు కర్రీపఫ్‌ను తెచ్చి ఇచ్చాడు. వేయిటర్ దగ్గర నుంచి కర్రీ పఫ్‌ను తీసుకున్న సదురు మహిళ తినడం స్టార్ట్ చేసింది.
Snake : ఇదేం దారుణం.. కర్రీ పఫ్‌లో పాము పిల్ల కనిపించే సరికి..!
జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న బేకరీకి వెళ్లింది. అక్కడ కర్రీ, ఎగ్‌పఫ్‌లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఆమెకు కర్రీపఫ్ రుచిలో ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో కనిపించిన పామును చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బెకరీ నిర్వాహకులను నిలదీస్తూ వారిపై ఫైర్ అయింది. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పఫ్‌లో పురుగులు, బొద్దింకలు కనిపిస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది పాము పిల్లని గుర్తించడంతో భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సాయంతో బాధితురాలు బేకరికి వెళ్లి యజమానిని ప్రశ్నించింది. అతను సరైన సమాధానం ఇవ్వకుండానే షాపు మూసేసి అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు విషయాన్ని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.