Home » Andhra Pradesh » Balakrishna Whistle In Ap Assembly Video Viral
andhra pradesh

Balakrishna : నిన్న తొడ కొట్టాడు.. ఇవాళ విజిల్ వేశాడు.. ఏంది బాలయ్య ఇది.. అసెంబ్లీ అనుకున్నావా లేక థియేటర్ అనుకున్నావా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 22, 2023, 12:00 pm
Advertisement

Balakrishna : నందమూరి బాలకృష్ణ.. సినిమా నటుడు అనేది పక్కన పడితే రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే. టీడీపీ నేత. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు. అందుకే ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బాలకృష్ణ అప్పుడప్పుడు కొంటెపనులు చూస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలకృష్ణ రోజూ చేస్తున్న వింత పనులు చూసి ఇతర ఎమ్మెల్యేలే కాదు.. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.

Advertisement

#image_title

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ తొడగొట్టిన విషయం తెలిసిందే. చూసుకుందాం అంటే చూసుకుందాం అంటూ బాలకృష్ణ సినిమా రేంజ్ లో డైలాగ్స్ చెప్పి తొడగొట్టారు. ఇక.. ఈరోజు ఏకంగా విజిల్ తీసుకొచ్చి విజిల్ వేస్తూ అసెంబ్లీలో హంగామా సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను నిన్న ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Balakrishna : టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా విజిల్ వేసిన బాలకృష్ణ

అయితే.. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బాలకృష్ణ విజిల్ వేశారు. అసెంబ్లీలో హడావుడి సృష్టించారు. ఆయన విజిల్ వేస్తుంటే మార్షల్స్ వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు. అయినా కూడా బాలకృష్ణ విజిల్ వేయడం మాత్రం ఆపలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లకు ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు.

Advertisement

 

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి