Home » Andhra Pradesh » Balakrishnas Sensational Comments On The Way Chandrababu Was Arrested
andhra pradesh

Balakrishna : చంద్రబాబు అరెస్టు చేసిన విధానం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: September 10, 2023 11:12 pm
Advertisement

Balakrishna : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్టు చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు చేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు అరెస్టుని ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు పట్ల సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని జైల్లో పెట్టాలని ఆలోచన తప్ప కేసులో ఏం లేదని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు చార్జి సీటు వేయకుండా ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు.

Advertisement

స్కిల్ డెవలప్మెంట్ కోసం తాను కూడా ఎన్నో క్యాంపులు పెట్టినట్లు తెలిపారు. చంద్రబాబుని జైల్లో పెట్టేందుకు ఎప్పుడో కేసు ఇప్పుడు బయటకు తీసారని వ్యాఖ్యానించారు. జగన్ పాలకుడు కాదు కక్ష దారుడని విరుచుకుపడ్డారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టు చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు.

balakrishna comments on the way chandrababu was arrested

Advertisement

నేను 16 నెలలు జైల్లో ఉన్నాను చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యం అన్నట్టు.. జగన్ కక్ష సాధిస్తున్నారు అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణం అని ప్రచారం తప్ప ఈ కేసులో అలాంటి వాస్తవం లేదని బాలయ్య వ్యాఖ్యానించారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి