
#image_title
Byreddy : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండిస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్ లు తక్కువేం కాదు.. ఆయనకు తగిన శాస్తి జరిగింది అని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజా అయితే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. బాలకృష్ణకు బీభత్సమైన వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. లోకేష్ పాదయాత్రను చాలా సార్లు ఆపారు. ఆయన అసలు ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. రాజమండ్రి జైలుకు చుట్టుపక్కన వస్తే చంద్రబాబే కొడతాడు లోకేష్ ను. 40 ఏళ్లలో ఎన్నో స్కామ్ లు చేశాడు చంద్రబాబు. కానీ.. దొరకలేదు. నువ్వు చెప్పినట్టు ఒక్క పని చేశా.. అడ్డంగా దొరికిపోయా అని చెప్పి లోకేష్ కనిపిస్తే కొట్టే పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు. అటువంటి వ్యక్తి భయం చూపిస్తాం అంటూ మాట్లాడటం ఆపితే మంచిది.
ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడు కూడా సమానమే. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. చించుతాం అంటున్నారు.. అది ఇదీ అంటున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చే సమస్యనే లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు జగన్. లూత్రా అనే వాడు ఎవడు.. చంద్రబాబు వీళ్లను పరిచయం చేస్తున్నాడు. న్యాయం జరగకబోతే కత్తులు పట్టుకోవాలట. అది కూడా హిందీలోనో ఇంగ్లీష్ లోనూ పెట్టాడు. వాళ్లు మారుతారని నేను అనుకోవడం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అనేది అది చిన్న స్కామ్ అది. చంద్రబాబు చేసిన వాటిలో చిన్న స్కామ్ అది. అమరావతి భూకుంభకోణం స్కామ్ పెద్దది. ఫైబర్ స్కామ్ పెద్దది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఉంది. ఇవన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. చాలా చోట్ల కేసులు ఉన్నాయి. చంద్రబాబుకి ఉన్న ఒక అహంకారం ఏంటంటే.. ఏ ముఖ్యమంత్రి వచ్చినా నేను మేనేజ్ చేస్తా. ఎవ్వరినైనా మేనేజ్ చేస్తా.. బెయిల్ తెచ్చుకోగలుగుతా.. తప్పించుకొని తిరగగలుగుతా అనుకున్నారు. ఫస్ట్ టైమ్ ఆయన జీవితంలో ఆటలు సాగడం లేదు.. అంటూ బైరెడ్డి మండిపడ్డాడు.
#image_title
పోనీ.. జైలుకు వెళ్లినా చంద్రబాబు మారాడా అంటే అదీ లేదు. వేడి నీళ్లు లేవు.. దోమలు కుడుతున్నాయి.. అంటే నువ్వు ఏం పెట్టి పుట్టావా? జైలులో పోతే దోమలు కాక ఇంకేం ఉంటాయి. బయటి నుంచి ఏమైనా హిట్ సప్లయి చేయాలా? దోమల మందు కొట్టాలా? జైలు అనుకుంటున్నావా? బెడ్ రూమ్ అనుకుంటున్నావా? వాళ్లు మారుతారు అనుకోవడం మన అవివేకం. జగన్ ను ఎన్ని మాటలు అన్నారు. సైకో అన్నారు. వాళ్ల భార్య గురించి మాట్లాడారు.. వాళ్ల తల్లి గురించి మాట్లాడారు. వ్యక్తిగతంగా దూషించారు. సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు, అది చంద్రబాబు ఒక్కడే కాదు, లోకేష్, ఆ పార్టీలో ఉండేటటువంటి స్క్రాప్ అందరూ మాట్లాడారు. మా ముఖ్యమంత్రి గురించి ఉల్ఫా గాళ్లు మాట్లాడటం ఏంటి అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు తప్పితే చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ఏ ఒక్కరూ బాధపడటం లేదు.. అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.