Prices : ఆ వస్తువుల ధరలు ఇక మరింత చౌక.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను రద్దు చేసి, అందులోని కొన్ని ప్రధాన వస్తువులను 5 శాతం లేదా 18 శాతం స్లాబ్‌లకు తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుదినిర్ణయం వెలువడే అవకాశముంది.
Prices : ఆ వస్తువుల ధరలు ఇక మరింత చౌక.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?
ప్రజల రోజువారి జీవితంలో అవసరమైన అనేక వస్తువులు ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 5 శాతానికి తరలిస్తే, వాటి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ , వంట సామాన్లు, ప్రెషర్ కుక్కర్లు, బట్టలు, బూట్లు, మొబైల్ ఫోన్లు, నెయ్యి, వెన్న, జున్ను, ప్యాక్ చేసిన కొబ్బరి నీరు, ఫ్రూట్ జ్యూస్‌లు, పాప్‌కార్న్, పెన్సిల్ షార్పెనర్లు, 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు.
ఈ మార్పుల వల్ల సాధారణ వాడకానికి సంబంధించిన వస్తువులపై మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు నెలవారీ ఖర్చులో తక్కువ భారం ఏర్పడే అవకాశం ఉంది. 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడం వల్ల, కొన్ని ఉత్పత్తులు 18% లేదా 28% స్లాబ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు, గృహోపయోగ సామాన్లపై పన్ను భారం పెరిగే అవకాశముంది.తద్వారా ఆ వస్తువుల ధరలు పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ మార్పులు పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.