#image_title
Chandrababu : తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఇవే చంద్రబాబు చెప్పిన సమాధానాలు. సీఐడీ విచారణలో చంద్రబాబు ఏం ప్రశ్నలు వేసినా ఇవే సమాధానాలు చెప్పారు. సీఐడీ విచారణ రెండు రోజుల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రెండు రోజుల కస్టడీ ముగిసినా చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. సీఐడీ అధికారులు దాదాపుగా 100 ప్రశ్నలు వేస్తే చంద్రబాబు మాత్రం నాకు తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా అంటూ దాటవేత సమాధానాలు చెప్పారు. దీంతో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఆయన రిమాండ్ పొడిగింపుపై పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పెంచింది.
#image_title
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును శని, ఆదివారాల్లో సీఐడీ డీఎస్పీ ధనంజయుడు సారథ్యంలోని దర్యాప్తు బృందం దాదాపు 12 గంటలు విచారించింది. ఈ విచారణలో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి సమాధానం చంద్రబాబు చెప్పలేదట. ఒకే సమాధానం అన్ని ప్రశ్నలకు చంద్రబాబు ఇవ్వడంతో ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరో 11 రోజులు పొడిగించారు.
రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు దర్యాప్తుకు అస్సలే సహకరించలేదని సీఐడీ అధికారులు వెల్లడించారు. మరో 11 రోజులు పొడిగించడంతో మరోసారి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారించి రికార్డు చేశారు. కాకపోతే సీఐడీ అధికారులకు మాత్రం చంద్రబాబు నుంచి ఎలాంటి కీలక సమాచారం లభించలేదు. ఆయన డొంకతిరుగుడు సమాధానాలతో సీఐడీ అధికారులకు కూడా చిరాకు వచ్చింది. కుంభకోణంలో తన పాత్ర ఉంది లేదా లేదు అనే విషయాన్ని మాత్రం చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేకపోయారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా కాంట్రాక్ట్ సంస్థల నుంచి తీసుకున్న 118 కోట్ల గురించి కూడా ప్రస్తావించారు. ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వాటిని తొక్కేసి 371 కోట్లు ఎలా విడుదల చేయించారు. లోకేష్ కు ఆయన సన్నిహితుడు కిలారి రాజేష్ కు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ గంటా సుబ్బారావు, సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ కు ఉన్న సంబంధాల మీద కూడా చంద్రబాబును ప్రశ్నించినా వేటికీ ఆయన సమాధానాలు ఇవ్వలేదు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.