
tdp chandrababu comment on engineering in bipc
Chandrababu : ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ.. ఏ పని చేసినా అంత తొందరపాటుతనం. ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా కొన్నిసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. ఏమన్నా అంటే నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అంటారు కానీ.. దానికి తగ్గట్టుగా మాత్రం ప్రవర్తించరు. మోస్ట్ సీనియర్ లీడర్ అంటారు. ఈ దేశంలో తనకు మించిన రాజకీయ అనుభవం ఉన్న నేత మరెవరూ లేరంటారు కానీ.. ఆయన మాట్లాడే మాటలు చూస్తే మాత్రం విచిత్రంగా ఉంటాయి.
ఎందుకంటే.. తాజాగా లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ విషయం ఏపీలో చర్చనీయాంశం అయింది. అది అక్రమ నిర్మాణం అని తేలినా కూడా తాను ఇంకా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఇంటి అంశం ఏసీబీ కోర్టులో ఉంది. ఆ కోర్టు కూడా ఆ ఇంటిని జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. కానీ.. తాను అద్దెకు ఉన్నానని.. అంటూ చంద్రబాబు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ.. అసలు ఆ ఇంటి పేరు మీద ఎలాంటి అద్దె లావాదేవీలు జరగలేదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.అసలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్ట వద్ద నిర్మాణం చేయడమే నిబంధనలకు విరుద్ధం. ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? ఇటువంటి నిర్మాణాలపై చంద్రబాబే చాలా సార్లు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు.. లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటూ అది అద్దెకు తీసుకున్నాం అని చెప్పడం విడ్డూరంగా ఉంది. అలాగే..
chandrababu staying in lingamaneni ramesh house in vijayawada
ఆ ఇల్లు విషయంలో లింగమనేనికి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. అసలు.. లింగమనేని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు చంద్రబాబు వత్తాసు పలకడం ఏంటి అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో ద్వారా వచ్చిన ఇల్లు కాబట్టే చంద్రబాబు అంతలా బాధపడుతున్నారా అనే వార్తలూ వినిపిస్తున్నాయి.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.