Kashmir Pahalgam Video : ర‌క్షించాలంటూ వేడుకున్న ప‌ర్యాట‌కులు.. వెలుగులోకి వ‌చ్చిన ప‌హ‌ల్గామ్ మొద‌టి వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kashmir Pahalgam Video : ర‌క్షించాలంటూ వేడుకున్న ప‌ర్యాట‌కులు.. వెలుగులోకి వ‌చ్చిన ప‌హ‌ల్గామ్ మొద‌టి వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Kashmir Pahalgam Video : ర‌క్షించాలంటూ వేడుకున్న ప‌ర్యాట‌కులు.. వెలుగులోకి వ‌చ్చిన ప‌హ‌ల్గామ్ మొద‌టి వీడియో

Kashmir Pahalgam Video : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతో మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ దాడి ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాల మధ్య ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఈ సుందరమైన ప్రాంతం ఇప్పుడు భీకర ఉగ్రదాడితో ఊహించని విధంగా మారింది.

Kashmir Pahalgam Video ర‌క్షించాలంటూ వేడుకున్న ప‌ర్యాట‌కులు వెలుగులోకి వ‌చ్చిన ప‌హ‌ల్గామ్ మొద‌టి వీడియో

Kashmir Pahalgam Video : ర‌క్షించాలంటూ వేడుకున్న ప‌ర్యాట‌కులు.. వెలుగులోకి వ‌చ్చిన ప‌హ‌ల్గామ్ మొద‌టి వీడియో

Kashmir Pahalgam Video ఘోరాతి ఘోరం..

ఆ రోజు జరిగిన ఘోరకలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు ఆ రోజు జరిగిన దుర్ఘటన, ఉగ్రమూకలు తమ పట్ల వ్యవహరించిన తీరును కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పర్యాటకులను లక్ష్యాంగా చేసుకునేందుకు లష్కర్‌ ఏ తైయబా తో సంబంధం ఉన్న ముఠా ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో భయంతో వణికిపోయింది.

వాళ్లంతా వద్దని వేడుకుంటున్నా పర్యాటకులనే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు ఉగ్రవాదులు. ఉగ్రమూకల దుష్టచర్యకు 26 మంది ప్రాణాలు వదిలేశారు. అనేక మంది గాయపడ్డారు. దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ క్షణంలో ఏం జరిగిందనే విషయాన్ని ఓ వీడియో స్పష్టంగా చెబుతోంది. ఈ వీడియోలో ఓ ముఠా పర్యాటక ప్రాంతంలోకి రావడం, కాల్పులు జరపడం కనిపిస్తోంది. వీడియో తీసే వ్యక్తి కూడా భయంత వణికిపోతున్న విషయాన్ని గమనించవచ్చు. అయితే ఈ వీడియోను చాలా దూరం నుంచి షూట్ చేసినట్టు తెలుస్తోంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి