
Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో !
Air India Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం రన్‌వేపై వేగంగా దూసుకెళ్తూ హాస్టల్ భవనాన్ని ఢీకొనడంతో భారీ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది దుర్మరణం చెందగా, కేవలం ఒకే ఒకడు విశ్వస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11ఏ సీటులో కూర్చున్న ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…
Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో !
ఆపదలో నుంచి బయటపడిన విశ్వస్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలోే తనకు ఏదో వింతగా అనిపించిందని చెప్పారు. ఒక్కసారిగా లోపల నిశబ్దం ఏర్పడిందని, ఆకుపచ్చ, తెలుపు లైట్లు వెలిగాయని గుర్తు చేశారు. పైలెట్లు పూర్తిగా కాపాడేందుకు ప్రయత్నించినా, విమానం నేరుగా ఓ భవనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో తన సీటుబెల్ట్ ఊడిపోయి, సీటుతో సహా బయటకు విసిరి పడినట్లు తెలిపారు. తాను చనిపోతానని అనుకున్నానని, కళ్లు తెరిచి చూస్తే బ్రతికే ఉన్నానని ఆయన ఎమోషనల్ గా తెలిపారు.
విమానం ముక్కలైపోవడం, మంటలు చెలరేగిన దృశ్యాలను కుమార్ వర్ణిస్తూ, తన పక్కన ఉన్న ఎయిర్ హోస్టెస్, ఇతర ప్రయాణికులు చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని, కానీ ఎమర్జెన్సీ డోర్ ఊడిపోవడంతో ఆ మార్గం ద్వారా బయటపడ్డానని చెప్పారు. ఈ సంఘటనలో తన చేతికి గాయమై కాలిపోయినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేయగా, విశ్వస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడిగా ప్రశంసలందుకుంటున్నారు.
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
This website uses cookies.