
Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద విన్యాసభరితమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Dallas : డాలస్, టెక్సాస్: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారంనాడు అంగరంగ వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయయోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.
Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద విన్యాసభరితమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ కాన్సుల్ జెనరల్అ ఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు స్వాగతం పలుకుతూ గత పది సంవత్సరాలగా ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ఇం డియా, డి. సి. మంజునాథ్ కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు.
Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద విన్యాసభరితమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ముందుగా మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు అయిన సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు. హాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.
Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద విన్యాసభరితమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు – మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ మొదలైన వారు తగు ఏర్పాట్లుచేసి యోగావేడుకలు విజయవంతంగావడంలో కీలకపాత్ర వహించారు.విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.