junior ntr to contest as mla from gudivada
Junior NTR : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే సంవత్సరం ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష టీడీపీ పార్టీకి సవాల్ తో కూడుకున్న పని. అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని తన చేతుల్లోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది ఎన్టీఆర్ అభిమానుల నమ్మకం.
దీనిపై ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది పక్కన పెడితే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు అని అంతా అన్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు వినిపిస్తున్నాయి. నారా లోకేశ్ కి అంత సత్తా లేదని, ఆయన రాజకీయాల్లో రాణించలేరని స్పష్టం అయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందనే అనుకోవాలి.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారట. గత కొంత కాలంగా ఏపీ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమైనట్టుగా వాళ్ల సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారట. అది కూడా ఏపీలోని గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారట. గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం కోసం అభిమానులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ కూర్చొంటున్నారు. ఏ ఫంక్షన్ కు వెళ్లినా ఎన్టీఆర్ ని సీఎం సీఎం అంటూ నినాదాలతో రాజకీయాల్లోకి రాకముందే సీఎంను చేస్తున్నారు.
junior ntr to contest as mla from gudivada
అటువంటి ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు అభిమానులు. ఇప్పటికే అధికార పార్టీ తరుపున గుడివాడ ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ ఆప్తమిత్రుడు కొడాలి నాని ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ తరుపున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీకి దిగితే.. ఎన్టీఆర్ వర్సెస్ కొడాలి నాని.. వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేసి టీడీపీ తరుపున గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే వార్త నిజం అయితే అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం. దీనికోసమే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. ఎన్టీఆర్ సీఎం అవడం ఖాయం అని చాలామంది అభిమానులు చెబుతున్నారు.
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.