Home » Andhra Pradesh » Kodali Nani Reacts After Seeing Balakrishna Behaviour In Ap Assembly
andhra pradesh

Balakrishna VS Kodali Nani : ఫ్లూటు నీ ముసలి నక్క బాబు ముందు ఊదు.. నా ముందు ఊదితే తల మెడ రెండూ ఉండవ్.. బాలయ్య రియాక్షన్ చూడండి

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: September 25, 2023 3:53 pm
Advertisement

Balakrishna VS Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను నడవనీయకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నరు. ఇక బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో తొడ గొట్టడం, మీసాలు తిప్పడం.. విజిల్ వేయడం ఇవన్నీ చూసి జనాలకు కూడా కోపం వచ్చింది. అసలు.. అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడం ఏంటి అని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు నడవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ చెప్పినా కూడా పట్టించుకోలేదు.

Advertisement

#image_title

బాలకృష్ణ బిహేవియర్ చూసి అసెంబ్లీలో కొడాలి నానికి చిరాకు వేసి బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలకృష్ణ తొడలు కొడుతున్నాడు. ఫ్లూటు ఊదుతున్నాడు.. అసలు ఫ్లూటు నీ ముసలి నక్క బాబు ముందు ఊదు బాలకృష్ణ.. నా ముందు కాదు. నీ సినిమా డైలాగ్స్ ఇక్కడ పనిచేయవు. తల, మెడ రెండూ ఉండవు నా ముందు నువ్వు ఫ్లూటు ఉదితే అని కొడాలి నాని బాలకృష్ణపై సీరియస్ అవడంతో దెబ్బకు బాలకృష్ణ మిన్నుకుండిపోయాడు.

Advertisement

Balakrishna VS Kodali Nani : జగన్ కి నవ్వాగలేదు

బాలకృష్ణకు కొడాలి నాని వార్నింగ్ ఇవ్వడంతో అది చూసి సీఎం జగన్ కు నవ్వాగలేదు. కొడాలి నాని పంచ్ లకు జగన్ పడి పడి నవ్వారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నవ్వారు. టీడీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీలో అదే రచ్చ చేశారు. మీరు ఇలాగే సభలో రచ్చ చేస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినా కూడా టీడీపీ సభ్యులు అలాగే చేయడంతో చివరకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి