Lakshmi Parvathi : బాలకృష్ణ పై లక్ష్మీపార్వతి సీరియస్ వ్యాఖ్యలు వీడియో వైరల్..!!
Lakshmi Parvathi ; ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో సీఎం జగన్ ని సైకో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఖండించారు. బాలకృష్ణ ఏదైనా మాట్లాడితే ఆరు నెలలకు గాని అర్థం కాదని సెటైర్లు వేశారు. ఏదో అల్లుడి కోసం ఇష్టానుసారంగా మాట్లాడినట్లు తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కుమారుడని రెండుసార్లు హిందూపురం ప్రజలు గెలిపించారు.
ఎమ్మెల్యేగా బాలకృష్ణ హిందూపురానికి ఏదైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు. కొంతమంది హిందూపురం ప్రజలు ఫోన్ చేస్తారు లేకపోతే విజయవాడ వచ్చినప్పుడు కలుస్తారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని ప్రశంసిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తున్నందు వల్ల ప్రజలు బాగున్నారా అమ్మ అని చెప్పుకొస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన సమయంలో హిందూపురం నియోజకవర్గం
Lakshmi Parvathi Comments On Balakrishna Wife
ప్రజల దగ్గర పీఏ మరియు బాలయ్య భార్య డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బాలకృష్ణ భార్య బస్సు ఎక్కి పారిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులందరికీ అద్భుతంగా డబ్బులు జమ చేస్తుంది. ఎక్కడ కూడా అన్యాయం లేకుండా అర్హులందరికీ న్యాయం చేస్తుంది. అటువంటి ఈ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే మీరే నష్టపోతారు అంటూ బాలయ్య పై ఇంకా చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
