Home » Andhra Pradesh » Minister Roja Comments On Nara Brahmani
andhra pradesh

Roja : నీ అయ్యా పిచ్చోడు.. నీ మామ సైకో.. పోయి వాళ్ల చెవితో ఊదు పీక.. బ్రాహ్మణిపై రోజా ఫైర్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 3, 2023, 4:00 pm
Advertisement

Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం.. చంద్రబాబు అరెస్ట్ అనేది అక్రమం అని.. కావాలని చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చంద్రబాబు ఫ్యామిలీ రాజకీయాల్లో తలదూర్చలేదు. కానీ.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇద్దరూ బయటికి వచ్చారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అలాగే.. బ్రాహ్మణి కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించి రాష్ట్రంలోని మహిళలందరికీ ఏకం చేసి వాళ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా చంద్రబాబు అరెస్ట్ పై ఎవరు నిరసన తెలిపినా కూడా వాళ్లపై కేసులు పెట్టి మరీ జైలులో వేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజాగా భువనేశ్వరి, బ్రాహ్మణి చేస్తున్న కార్యక్రమాల్లో ఏపీ మంత్రి రోజా సీరియస్ అయ్యారు. రాష్ట్రం విడిపోయింది.. రాష్ట్రాన్ని బాగు చేస్తారు అనే ఉద్దేశంతో 5 ఏళ్లు.. టీడీపీకి ప్రజలు అవకాశం ఇస్తే మీరు చేసింది ఏంటి.. ఐదేళ్లలో యువత డబ్బును దోచుకున్నారు. ఇప్పుడు సాక్ష్యాదారాలతో సహా దొరికారు. యువత డబ్బును కూడా వదలని చంద్రబాబును అరెస్ట్ చేస్తే సిగ్గు లేకుండా వాళ్ల భార్య, వాళ్ల కోడలు గంట కొట్టండి.. జగన్ మోహన్ రెడ్డి సైకో.. ఆయనకు బుద్ధి చెప్పండి అంటున్నారు. బ్రాహ్మణి గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ.. ఈ రాష్ట్రంలోనే పెద్ద సైకో ఎవరైనా ఉన్నారు అంటే.. అది మీ నాన్న బాలకృష్ణ గారు, మీ మామ చంద్రబాబు గారు. మీ తాతని అంటే.. మీ నాన్నకి మీ మామకి అడ్రస్ ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేసి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అంటూ రోజా దుయ్యబట్టారు.

#image_title

Advertisement

Roja : జగన్ మీద ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు

జగన్ మీద ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేదు. కానీ.. చంద్రబాబు తప్పును మీరు కప్పిపుచ్చుతూ.. అందరినీ మభ్య పెట్టాలని, దిగజారుడు మీటింగ్స్ పెట్టి, ట్వీట్స్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించి.. హైదరాబాద్ కు పరిమితం అయిన వీళ్లను.. మళ్లీ ఏపీకి రాకుండా తరిమికొట్టాలి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నవి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే. కానీ.. ఇప్పుడు జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వైద్య శాఖలో ఆరోగ్య ప్రదాతలు ఉన్నారో.. వాళ్లలో 50 వేల వేకెన్సీలను ఫిల్ చేసి అన్ని చోట్ల డాక్టర్లు, మెడిసిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి రోజా కొనియాడారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి