Roja : ఏపీ మంత్రి రోజా గురించి తెలుసు కదా. తను వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వైసీపీకి వీరవీధేయురాలిగా ఉంటుంది రోజా. అందుకే సీఎం జగన్ కు కూడా రోజా అంటే చాలా ఇష్టం. తను వైసీపీలో ఉంటే జగన్ కు చాలా దైర్యంగా ఉంటుంది. జగన్ పై ఈగ కూడా వాలనివ్వదు రోజా. తాజాగా హైదరాబాద్ లో మీడియా మీట్ సందర్భంగా పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు రోజా. తనకు వైజాగ్ అంటే.. వైజాగ్ బీచ్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. తన తొలి మూవీ చామంతి సినిమా షూటింగ్ అంతా ఆ బీచ్ లోనే జరిగిందని.. ఈ భీమిలి హౌస్ లోనే ఉన్నామని.. నేను యాక్ట్ చేసిన వైజాగ్ అంటే నాకు ఇష్టం. అలాగే.. నాకు టూరిజం మంత్రిత్వ శాఖ రావడం, మళ్లీ వైజాగ్ బీచ్ ను డెవలప్ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు రోజా.
మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు రోజా. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్లలేదు. ఇక్కడిక్కడే తిరిగాను. మా నాన్న సౌండ్ ఇంజనీర్ గా ఇక్కడే పని చేశారు కాబట్టి నేను ఇక్కడే పుట్టా. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదివా. హైదరాబాద్ అందరికీ నచ్చిన ప్లేస్. హైదరాబాద్ ఎటు తిరిగినా బాగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది రోజా. జగన్ మళ్లీ ముఖ్యమంత్ర అవుతారు.. మేమంతా మళ్లీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి 98 శాతం తొలి సారి సీఎం అయిన వెంటనే నాలుగున్నర ఏళ్లలో చేయడం అనేది నభూతో నభవిష్యత్ అని అన్నారు రోజా. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలో చెప్పండి అంటూ రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా ఏం ఇబ్బంది లేదు. ఇప్పటికే చంద్రబాబు ఫెయిల్యూర్ పొలిటిషిన్ అయ్యాడు. జనసేన బోణీనే కాలేదు. ఇద్దరు సన్యాసులు కలిస్తే బూడిదే వస్తుంది తప్ప వాళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని రోజా చెప్పుకొచ్చారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.