Modi : పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్
Modi : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు భారీ షాక్ తగిలింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించినా, వాటిలో ఎటువంటి మార్పు చేయకపోవడం ద్వారా పొదుపుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మోదీ సర్కార్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెట్టుకున్న వారు నిరాశ చెందాల్సి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Modi : పండగవేళ మోడీ సర్కార్ సామాన్యులకు భారీ షాక్
ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 28, 2025న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మార్చలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై 7.1%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై 7.7%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)పై 8.2%, సుకన్య సమృద్ధి యోజన (SSY)పై 8.2% వడ్డీ అమలులో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4%, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9%, 2 సంవత్సరాలపై 7%, 3 సంవత్సరాలపై 7.1%, 5 సంవత్సరాలపై 7.5%, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 6.7% వడ్డీ ఉంటుంది.
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను త్రైమాసిక సమీక్ష ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు.. ఈ పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ల దిగుబడికి అనుగుణంగా ఉంటాయి. 2024 ప్రారంభంలో కొన్ని పథకాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ, ప్రస్తుతం ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో పెట్టుబడిదారులు నిరాశ చెందుతున్నారు. పొదుపుదారులకు మెరుగైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.