Home » Andhra Pradesh » Mp Gorantla Madhav Comments On Chandrababu
andhra pradesh

Chandrababu : 2024 లో చంద్రబాబు చస్తాడు.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 27, 2023, 12:15 pm
Advertisement

Chandrababu : 2024 లో చంద్రబాబు చస్తాడు.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు.. అంటూ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన తాజాగా వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. చంద్రబాబు మొన్నటి వరకు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు.

Advertisement

ఇక.. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ హేళన చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు రాజమండ్రి జైలులోనే చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు 2024 లో చస్తారని.. ఆ తర్వాత మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు ఫినిష్.. ఎంత సేపు.. గన్ మెన్స్, జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసేస్తే ఆయన ఫినిష్ అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా గోరంట్ల కూడా చంద్రబాబుపై డైరెక్టుగా మాట్లాడటంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీళ్లు మాట్లాడటమే కాదు.. చంద్రబాబుకు ఏదైనా హానీ తలపెట్టినా తలపెడతారు అని చంద్రబాబు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఏది ఏమైనా.. పబ్లిక్ గా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి