Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ముందు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆ రిమాండ్ ను మళ్లీ పెంచారు. రాజమండ్రి జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. కానీ.. ఇప్పటి వరకు సీఐడీ అధికారులకు చంద్రబాబు సహకరించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అసలు ఏం జరిగింది. షెల్ కంపెనీల పేరుతో ఎలా కోట్లకు కోట్లు నొక్కేశారు అనే దానిపై చంద్రబాబును సీఐడీ అధికారులు చాలా ప్రశ్నలు వేశారు. కానీ.. చంద్రబాబు మాత్రం వేటికీ సరైన సమాధానం చెప్పడం లేదు. ఓవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబపై విచారణ జరుగుతుండగానే మరో మూడు స్కామ్ లపై కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. వాటిపై ముందస్తు బెయిల్ కు కూడా చంద్రబాబు పిటిషన్ వేసినా బెయిల్ ఇవ్వలేదు.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా ఏపీ సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే.. చంద్రబాబు అరెస్ట్ పై ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్న సమయంలోనే ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లి మరీ నారా లోకేష్ కు నోటీసులు జారీ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో నారా లోకేష్ పేరుతో పాటు హెరిటేజ్ సంస్థ పేరు కూడా ఉంది. ప్రస్తుతం నారా లోకేష్ ను మాత్రం సీఐడీ అధికారు విచారిస్తున్నారు. తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు ఉదయమే నారా లోకేష్ చేరుకున్నారు. నారా లోకేష్ ను సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నట్టు తెలుస్తోంది. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై నారా లోకేష్ ఒత్తిడి తెచ్చారని ఆయనపై సీఐడీ ప్రధాన అభియోగాలు మోపింది.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా రాశారు. అంతే కాదు.. హెరిటేజ్ సంస్థ పేరు, ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను కూడా సీఐడీ అధికారులు చేర్చినట్టు తెలుస్తోంది. అయితే.. నారా లోకేష్ విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తారా? లేక వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.