Home » Andhra Pradesh » Pawan Kalyan Vs Perni Nani
andhra pradesh

Pawan Kalyan Vs perni Nani : నా చెప్పులు పోయాయి అని పవన్ కామెంట్లకు పేర్ని నాని అదిరిపోయే కౌంటర్ వీడియో…!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 18, 2023, 9:00 pm
Advertisement

Pawan Kalyan Vs perni Nani : ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత వర్సెస్ వైసీపీ నేత పేర్ని నాని మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం పేలుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పేర్ని నానిని ఉద్దేశించి సన్నాసి అని చాలా దారుణమైన పరుష పదజాలంతో.. విమర్శలు చేయడం జరిగింది. అదే రీతిలో మీడియా సమావేశం నిర్వహించి పేర్ని నాని కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల వారాహి విజయ యాత్ర అంటూ పవన్ కళ్యాణ్ కత్తిపూడి, పిఠాపురం వంటి చోట్ల రోడ్డు షోలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది.

Advertisement

ఎట్టి పరిస్థితుల్లో వైసిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ ఉన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలకు పేర్ని కౌంటర్ ఇస్తూ గతంలో వైసీపీ నాయకులను చెప్పుతీసుకొని కొడతా అని పవన్ చేసిన వ్యాఖ్యలకు… పేర్ని నాని తన రెండు చెప్పులు తీసి.. నా దగ్గర ఉన్నాయి అని మండి పడటం జరిగింది. దీంతో పిఠాపురం సభలో అన్నవరంలో తన రెండు చెప్పులు వైసీపీ పార్టీకి చెందిన వాళ్లు ఎవరో దొంగిలించారు అని పరోక్షంగా పేర్ని నాని పై పవన్ సెటైర్లు వేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. గతంలో తన చెప్పు కూడా ఒకటి పోయిందని ఆ టైంలో మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా దేవాలయానికి వెళ్ళటం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan Vs perni Nani

Advertisement

ఈ చెప్పులు అవి ఇవి కావు… ముందు జనసేన పార్టీ సింబల్ పోయింది దాన్ని వెతుక్కోమనండి అంటూ పవన్ పై పేర్ని నాని తిరుగులేని కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి గుర్తు అయిన గ్లాస్ సింబల్ నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి పేర్ని నాని పవన్ పై ఊహించని రీతిలో కౌంటర్లు వేశారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి