Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు. ఈ నేపథ్యంలో, భారతీయ అమెరికన్ హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమిస్తూ తన పాలకవర్గానికి ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెల్లగొడతానని తెలిపారు. చట్టబద్ధంగా తమ దేశానికి రావాలనుకునేవారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను సింప్లిఫై చేస్తానని ట్రంప్ ప్రకటించడం వల్ల యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు భారీ ఊరట కలగనుంది
వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తాను. నియమనిబంధనలు, చట్ట ప్రకారమే అమెరికాకు రావాలి. అక్రమంగా కాదు. యూఎస్‌కు వచ్చేందుకు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. వారందరూ అక్రమ వలసదారుల వల్ల అన్యాయానికి గురయ్యారు. అమెరికాకు రాబోయేవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి. అమెరికా గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే దేశాన్ని ప్రేమించాలి. నేరస్థులు అమెరికాకు వద్దు. గత మూడేళ్లలో అమెరికాకు 13,099 మంది నేరస్థులు వచ్చారు. దేశ నడివీధుల్లో వారు నడుస్తున్నారు. వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు దేశానికి వద్దు. మన దేశం నుంచి నేరస్థులను తరిమి కొట్టాలి.” ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల సమస్యను హైలైట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలలో పత్రాలు లేని వ్యక్తులు ఓటు హక్కు కల్పించారని ఆరోపించారు. డ్రీమర్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. “వారి కోసం మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే వారు చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తులు. నేను డెమొక్రాట్‌లతో కలిసి ఒక ప్రణాళికతో పని చేస్తాను. రిపబ్లికన్లు డ్రీమర్ ఇమ్మిగ్రెంట్స్‌కు అండగా ఉంటారు” అని ట్రంప్ తెలిపారు.
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.