Categories: Newspolitics

Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

Advertisement
Advertisement

Ys Sharmila : ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్, ష‌ర్మిళ‌ల ఆస్తి పంప‌కాల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్‌, షర్మిల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాల వివాదం, షర్మిల లేఖలు రాయడం, ఎన్సీఎల్‌టీని జగన్‌ ఆశ్రయించడం… వీటన్నింటి పైనా వైసీసీ నేత పేర్ని నాని స్పందించారు. వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బతికున్నప్పుడే జగన్‌కు షర్మిలకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన స్వార్జితపు ఆస్తిలో కూడా చెల్లి షర్మిలకు జగన్‌ వాటా ఇచ్చారని లెక్కలతో సహా చెప్పారు వైసీపీ సీనియర్ నేత. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విషయంలో… షర్మిల మార్పులుచేర్పులు చేయడంతో వివాదం మొదలైందంటున్నారు వైసీపీ నేత పేర్ని నాని.

Advertisement

Ys Sharmila ఆస్తుల‌పై క్లారిటీ..

వైఎస్ మరణానికి ముందే ఆయన ఆస్తులను పంపకాలు చేసారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం ఇచ్చారని పేర్ని నాని వివరించారు 15మెగావాట్ల సండూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్, స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్‌ – యువరాజ్‌ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు దక్కాయి. ఆస్తులు కాకుండా భారతి సిమెంట్స్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, మీడియా వ్యాపారసంస్థలన్నీ జగన్‌ స్వార్జితం అన్నారు పేర్ని నాని.

Advertisement

Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

షర్మిలపై జగన్‌కు ప్రేమ లేకుంటే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న తన ఆస్తులు, వ్యాపారాల్లో వాటాలను ఆమెకు జగన్‌ ఎలా రాసిస్తారని ప్రశ్నించారు పేర్ని నాని. షర్మిలకు పెళ్లయిన ఇన్నేళ్లకు, వైఎస్ చనిపోయిన దశాబ్దం తర్వాత, 2019లో తన స్వార్జితపు ఆస్తిలో వాటాలను షర్మిలకు రాసిచ్చారంటే జగన్‌కు ఆమె మీద ప్రేమ ఉన్నట్లా? లేనట్లా అన్నారు పేర్ని. తన తల్లిని చెల్లిని కూర్చోబెట్టి అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్లో వాళ్లకు వాటా ఇస్తానంటూ జగన్‌ అండర్‌స్టాండింగ్‌ రాసుకున్నారని పేర్ని వివరించారు. తండ్రి చనిపోయినా ఇన్ని ఏండ్లకు ఎవరైనా ఆస్తులు పంచుతారా..? ప్రశ్నించారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులను ఇప్పటికే జగన్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆస్తిలో ఎవరికైనా చెల్లెల్లకు పంచారా..? అని ప్రశ్నించారు.

Advertisement

Recent Posts

Adabidda Nidhi Scheme : ఆడబిడ్డ నిధితో 1500 ఖాతాలోకి.. ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

Adabidda Nidhi Scheme : ఏపీ ప్రభువం నుంచి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్ధిక…

5 hours ago

Mekathoti Sucharitha : జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌.. ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా..!

Mekathoti Sucharitha : ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో వైసీపీ దారుణ‌మైన ఓట‌మి చ‌విచూడ‌డంతో పార్టీకి చెందిన నాయ‌కులు ఒక్కొక్క‌రుగా…

6 hours ago

Annadata Sukhibhava Scheme : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం ఏర్పాటు 20000 కావాలంటే ఇలా చేయండి..!

Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం…

7 hours ago

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌ల‌న‌ల‌ని జగ‌న్ కాపీ కొడుతున్నాడా.. ఏం జ‌రుగుతుంది..!

Pawan Kalyan : అధికారంలో ఐదేళ్లు ఉండి, ఆ త‌ర్వాత ప‌ద‌వి పోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జ‌గ‌న్‌ని…

8 hours ago

Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

Ys sharmila : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్…

9 hours ago

Bigg Boss 8 Telugu : ఈ వారం ఎలిమినేష‌న్‌లో కూడా స‌స్పెన్స్.. టాప్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రు బ‌య‌ట‌కి..!

Bigg Boss 8 Telugu : సీజ‌న్ 8లో ఎలిమినేష‌న్స్ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. గత వారం నాగ మణికంఠ తాను…

10 hours ago

Sprouted Fenugreek Seeds : డయాబెటిస్ కు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే… ప్రతిరోజు మొలకెత్తిన మెంతులను తీసుకోండి…??

Sprouted Fenugreek Seeds : ప్రతి ఒక్కరి వంట గదిలో మెంతులు కచ్చితంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో…

12 hours ago

Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే… అస్సలు పడేయరు…??

Jamun Seeds : ఈ మధ్యకాలంలో విత్తనాల ప్రాధాన్యత అనేది చాలా బాగా పెరిగిపోయింది. కేవలం పండ్లు మాత్రమే తిని గింజలను…

13 hours ago

This website uses cookies.