
Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా... సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్...!
Roja : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేపడుతున్నారు. వారి అభిమాన రాజకీయ నాయకులకు అండగా నిలబడి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ , హైపర్ ఆది వంటి వారు పలుచోట్ల ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు గెటప్ శీను మరియు సుడిగాలి సుధీర్ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి సుదీర్ మరియు గెటప్ శీను పర్యటించారు. ఇక ఇదే సమయంలో పిఠాపురం ప్రసిద్ధ దేవాలయం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్లి వాళ్ళిద్దరూ దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా గెటప్ శీను సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ….మేము సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుండే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానులం. వారికోసం ఇప్పుడు మేము సాధారణ మనుషుల్లాగే ప్రచారాలు చేస్తున్నామని తెలియజేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తధ్యమని ప్రజలు అంటున్నారు. అంతేకాదు లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవనున్నట్లు తెలుస్తుందని చెప్పారు.అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది పేదలకు ఎన్నో రకాలుగా సహాయం అందించారని అలాంటి నాయకుడిని గెలిపిస్తే మరింత మంచి చేస్తాడని తెలియజేశారు.
Roja : మీరు వస్తే పవన్ గెలుస్తాడా… సుడిగాలి సుదీర్, గెటప్ శీను పై రోజా ఫైర్…!
ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోజా జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారాలలో పాల్గొనడంపై స్పందించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ….వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే వారిని ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి తప్ప వారిని తిట్టడం వేస్ట్. వాళ్లంతా చిన్న చిన్న షోలు చేసుకుంటూ , క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఉంటారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి ఆరేడుగురు హీరోలు ఉన్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సినీ అవకాశాలు రాకుండా చేస్తారనే భయంతోనే వారంతా జనసేన తరఫున మాట్లాడుతున్నారు కానీ ప్రేమతో కాదని రోజా తెలియజేశారు. ప్రేమ వేరు భయం వేరు అని భయంతో పనిచేసే అలాంటి చిన్న చిన్న వారిని నేను తిట్టాలి అనుకోనని రోజా తెలిపారు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారు కూడా కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ రోజా తెలియజేశారు
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.