Home » News » Wife Warns Husband With Knfe On First Night
News

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 25, 2025 4:25 pm
Advertisement

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే యువతిని వివాహం చేసుకున్నాడు. శోభనం రోజు సితార తన గదిలోకి పాల గ్లాస్ కు బదులు కత్తి ని తీసుకొచ్చి భర్త కు షాక్ ఇచ్చింది. ‘‘నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా’’ అంటూ హెచ్చరించిందని. ఆమె మాటలు వినగానే నిషాద్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తన గత ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పటికే మేనల్లుడైన అమన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భర్తను బెదిరించిందని అతడు పోలీసులకు తెలిపాడు.

Advertisement

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  మొదటి రాత్రే ..భర్తకు కత్తితో వార్నింగ్ ఇచ్చిన భార్య

వివాహానంతరం సితార కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని తన భర్తను అడిగిందట. నిషాద్ మాట్లాడుతూ., ‘‘అప్పుడు నేను ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య ఘటనను గుర్తు చేసుకుని భయపడ్డాను’’ అని పేర్కొన్నాడు. నిద్రలో కూడా సౌకర్యంగా ఉండలేకపోయానని, ప్రతి క్షణం ఏం జరుగుతుందో అన్న అనుమానంతో ఉన్నానని తెలిపాడు. అంతే కాక తన భార్య ప్రేమికుడు అమన్ నుంచి మెసేజ్‌లు వచ్చాయని, అతను కూడా చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు.

Advertisement

వివాహం జరిగిన మూడు రోజుల పాటు సితార భర్త ఇంట్లో ఉండగా, నాలుగో రోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయింది. నిషాద్ఎప్పటికైనా భార్య నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన నిషాద్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘పెళ్లి అనే మాట వింటేనే ఇప్పుడు గుండెల్లో దడ పుడుతోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతోంది. ఇలా రోజుకో వార్త వెలుగులోకి వస్తుండడంతో పెళ్లి చేసుకోవాలి అనుకునే యూత్ ఖంగారు పడుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి