Categories: Newspolitics

Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ?

Advertisement
Advertisement

Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ రైతు, మహిళా, మైనారిటీ, న్యాయ, గ్రీవెన్స్‌ విభాగాల అధ్యక్షులను నియమించారు.. ఈ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్‌కి స‌పోర్ట‌ర్స్ ఎవ‌రు, వెన్నుపోటు పొడిచేదెవ‌రు అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్రబాబు సైతం నాడు పార్టీని నిలబెట్టుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. గెలుపు ఓటములు అంతా అధినేతల మీదనే పోతోంది. వారే ఆ క్రెడిట్ ని అయినా లేక ఓటమిని అయినా తీసుకోవాల్సి వస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు కూడా పార్టీని ఖాళీ చేసి నేతలు పోతూంటే ఏమీ చేయలేకపోతున్నారు.

Advertisement

Ys Jagan ఎవ‌రు బెస్ట్..

జగన్ కి ఈ కష్టకాలంలో అండగా ఉన్న నేతలు ఎవరూ అన్నది ఒక్కసారి చూసుకుంటే కనుక ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. వీరే గతంలో పార్టీలో కొంత వరకూ చక్రం తిప్పారు. జగన్ కి అన్ని విధాలుగా నీడగా ఉంటూ వచ్చారు. వీరు తప్పించి జిల్లా స్థాయిలలో పెద్ద లీడర్లు అనిపించుకున్న వారు ఎవరూ ముఖం చూపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అంతా తామే అని అని చక్రాలు గిర్రున తిప్పిన వారు అయితే ఇపుడు కంటికి క‌నిపించ‌కుండా పోయారు. అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి జగన్ కి వెరీ క్లోజ్ అని చెప్పుకున్న వారు అంతా కూడా ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌నే చ‌ర్చ వైసీపీలో న‌డుస్తుంది.

Advertisement

Ys Jagan : జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎవ‌రు ఉన్నారు.. వెన్నుపోటు పొడిచేదెవ‌రు ?

అయితే జ‌గ‌న్ ఇప్పుడు ఎక్క‌డికి వెళ్లిన కూడా ఆయ‌న వెంట నేతలు ఎవ‌రు కూడా క‌నిపించ‌డం లేదు. జగన్ పక్కన ఉంటే తమ మీద కూడా కేసులు ఎక్కడ పెడతారో అన్న భయంతో పాటు ఏపీలో ఉంటే అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటే పార్టీ ఖర్చులు పెరుగుతాయని ముందస్తు జాగ్రత్తలతోనే కొంద‌రు వెన‌క్కి వెన‌క్కి వెళుతున్నార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. మ‌రి కొంద‌రు జ‌గ‌న్‌కి వెన్ను పోటు పొడిచే ప్లాన్‌లో ఉన్నార‌ని స‌మాచారం. జ‌గ‌న్ మాత్రం పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన వారికి 2029లో అవకాశాలు ఉంటాయని కూడా ఆయన కచ్చితంగా చెబుతున్నట్లుగా తెల్సుతోంది. మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి ఓడితే కానీ క‌ళ్లు తెర‌వ‌డం లేదు.

Advertisement

Recent Posts

Seetha Payanam Movie Review : సీతా ప‌య‌నం మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…

15 minutes ago

Kalyan – Thanuja : కళ్యాణ్ – తనూజ మళ్ళీ ప్రేమ చిగురిస్తోంది ?? ప్రూఫ్ ఇదే !

Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…

1 hour ago

Sreeja : కాబోయే భర్త గురించి ఓపెన్ గా చెప్పేసిన దమ్ము శ్రీజ..!

Sreeja  : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…

2 hours ago

Ysrcp : వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…

3 hours ago

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

5 hours ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

6 hours ago

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌…

7 hours ago

Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

Telangana Municipal Results 2026  : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…

8 hours ago