Nara Brahmani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉండటంతో టీడీపీ పార్టీని ముందుండి ఎవరు నడిపించాలి? నారా లోకేష్ కు నడిపించే సత్తా ఉందా? లేక చంద్రబాబు వారసత్వాన్ని బ్రాహ్మణి పుణికిపుచ్చుకుంటారా? లేక ఆయన భార్య భువనేశ్వరి పార్టీని ముందుండి నడిపిస్తారా? అనే దానిపై క్లారిటీ రావడం లేదు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. నారావారిపల్లి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్ర నిర్వహించనున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలోనే మూడు రోజులు యాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో భువనేశ్వరి సభలు ఉండనున్నాయి. ఏది ఏమైనా.. అసలు పార్టీని ఎవరు నడిపించాలి.. భువనేశ్వరికి అంత సత్తా ఉందా? అనే దానిపై స్పష్టం లేదు. అయితే.. ప్రస్తుతం నారా లోకేష్ కు పార్టీని నడిపించే సత్తా లేదు అని ఇప్పటికే స్పష్టం అయింది. దీంతో ఇక.. తప్పని పరిస్థితుల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ పార్టీని ముందుండి నడిపించాలని అనుకుంటున్నారు అని స్పష్టం అవుతోంది.
అయితే.. నారా బ్రాహ్మణి ఏం ఆలోచిస్తోందో.. వైసీపీ మహిళా నేతలు చెప్పుకొచ్చారు. నారా బ్రాహ్మణి తన భర్త నారా లోకేష్ కోసం చివరకు సొంత తండ్రికే వెన్నుపోటు పొడవబోతోందని స్పష్టం చేశారు. ఎందుకంటే.. చంద్రబాబు జైలులో ఉన్నా.. పార్టీకి అండగా నేను ఉంటాను అని బాలకృష్ణ చెప్పారు. అలాగే.. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు జైలు నుంచి బయటికి రాకపోతే.. నిజంగానే పార్టీ ఎక్కడ బాలకృష్ణ చేతుల్లోకి వెళ్తుందో అని నారా బ్రాహ్మణి ఆలోచించి పార్టీని తన తండ్రి చేతుల్లోకి వెళ్లకుండా పార్టీని తమ దగ్గరే ఉంచుకోవాలని.. అప్పుడే పార్టీ తన భర్త చేతుల్లో ఉంటుందని అనుకొని నారా బ్రాహ్మణి సొంత తండ్రికే వెన్నుపోటు పొడవబోతోంది అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. భయంతో కూడా పార్టీని ఎలాగోలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే కాన్సెప్ట్ తో బ్రాహ్మణి వైసీపీ నేతలపై దుష్టప్రచారాలకు శ్రీకారం చుట్టారు అని తెలిపారు.
కావాలని ఐటీడీపీని నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి చేతుల్లోకి తీసుకున్నారు. టీడీపీని నందమూరి ఫ్యామిలీలోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ ప్రకారం వీళ్లు వ్యవహరిస్తున్నారు. నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ చేసేటప్పుడు ఏమన్నారు. మా అత్త గారు ఇంట్లో నుంచి బయటికి కూడా రారు అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్లకు తల్లి ఉండదా? అంటూ మండిపడ్డారు. ఆనాడు తాతను వెన్నుపోటు పొడిచినా నువ్వు ఏనాడూ మాట్లాడలేదు.. సొంత తండ్రిని వెన్నుపోటు పొడిస్తే మీ అత్త గారు మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు నువ్వు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే మీ ఫ్యామిలీ మొత్తం వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్ అని దుయ్యబట్టారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.