Bangaru Bullodu Review
సినిమా పేరు : బంగారు బుల్లోడు
నటీనటులు : అల్లరి నరేశ్, పూజా జవేరి, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, పృథ్వీ, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, గెటప్ శీను, ప్రవీణ్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
డైరెక్టర్ : పీవీ గిరి
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
సంస్థ : ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
అల్లరి నరేశ్ సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నిజానికి తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ కామెడీ హీరోలు లేరు. అంటే కామెడీని పంచే హీరోలు అని అర్థం. కామెడీని పంచుతూ.. ఆధ్యంతం ప్రేక్షకులను నవ్వించే హీరో అంటే నో డౌట్.. మొదటి వరుసలో ఉంటారు అల్లరి నరేశ్. ఆయన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. అల్లరి నరేశ్ సినిమాలు అంటే ఫ్యామిలీతో చూడొచ్చు.. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.. పిల్లలు కూడా అల్లరి నరేశ్ సినిమాలను బాగానే ఇష్టపడతారు. అందుకే.. అల్లరి నరేశ్ కు ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ ఉంది. నిర్మాతలు కూడా అల్లరి నరేశ్ తో సినిమాలు చేయడానికి పెద్దగా ఇబ్బంది పడరు. సరే.. మనం అసలు విషయానికి వస్తే.. తాజాగా అల్లరి నరేశ్ కొత్త మూవీ బంగారు బుల్లోడు రిలీజ్ అయింది. ఈ సినిమాకు నందిని నర్సింగ్ హోమ్ సినిమా డైరెక్టర్ పీవీ గిరి(గిరి పాలిక) దర్శకత్వం వహించారు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన అల్లరి నరేశ్ సినిమా బంగారు బుల్లోడు తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? అనేది తెలియాలంటే ముందు సినిమా కథేంటో తెలుసుకోవాలి.
ఈ సినిమాలో అల్లరి నరేశ్ పేరు భవాని ప్రసాద్. హీరోయిన్ పూజా జవేరి పాత్ర పేరు కనక మహాలక్ష్మీ. భవాని ప్రసాద్ కు, అతడి సోదరులకు అస్సలు పెళ్లిళ్లు కావు. ఎంతమంది అమ్మాయిలు చూసినా వీళ్లను మెచ్చరు. అయితే.. వీళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి కారణం వీళ్ల తాత(తనికెళ్ల భరణి) చేసిన ఓ తప్పు. దాని వల్లనే వీళ్లకు ఇన్ని రోజుల నుంచి పెళ్లిళ్లు కావడం లేదని తెలుసుకున్న భవానీ ప్రసాద్.. ఆ తప్పును సరిదిద్దడం కోసం చేసే పనులే ఈ సినిమా. అయితే.. తన తాత తప్పును సరిదిద్దే సమయంలో కనకమహాలక్ష్మీతో భవానీ ప్రసాద్ ప్రేమలో పడతాడు. అసలు.. తన తాత ఏం తప్పు చేశాడు? కనకమహాలక్ష్మీతో ఎలా ప్రేమలో పడ్డాడు? మధ్యలో అమ్మవారి నగలకు, భవానీ ప్రసాద్ కు సంబంధం ఏంటి? వాటి వల్ల వీళ్లకొచ్చిన సమస్య ఏంటి? అనేదే మిగితా స్టోరీ.
సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే అల్లరి నరేశే. ఆయనే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశారు. స్వాతిముత్యం సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా సినిమా మొత్తం పల్లెటూరులో షూట్ చేయడంతో అచ్చమైన స్వచ్ఛ తెలుగు పల్లెటూరును మనం ఈ సినిమాలో ఆస్వాదించవచ్చు. బంధాలు, బంధుత్వాలను సినిమాలో బాగా చూపించారు.
హీరోయిన్ పూజా తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకుంది. గ్లామర్ షో బాగానే చేసింది. కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేశ్, ప్రభాస్ శీను, ప్రవీణ్.. వీళ్లంతా కామెడీని బాగానే పండించారు.
పేరుకు సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అయినా సినిమాలో కామెడీ మాత్రం మిస్ అయింది. డైరెక్టర్ సినిమా కోసం ఒక లైన్ రాసుకున్నారు. కానీ.. ఆ లైన్ ను దాటేసి వేరే ట్రాక్ ఎక్కించారు. అక్కడ డైరెక్టర్ కాసింత దృష్టి పెడితే బాగుండేది. స్టోరీ ప్లస్ డైరెక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచాయి. సినిమాలో కొత్తదనం అయితే ఏం లేదు. రొటీన్ రొడ్డకొట్టుడే.
మీకు 1993లో వచ్చిన బంగారు బుల్లోడు సినిమా గుర్తుందా? నందమూరి బాలకృష్ణ ఆ సినిమాలో హీరో. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్. కానీ.. అదే పేరుతో వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. సినిమాలో కథ ఉంది కానీ.. కామెడీ లేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అయింది.
అల్లరి నరేశ్ సినిమాలు ఇష్టపడేవాళ్లు సినిమాకు వెళ్లొచ్చు. ఏదో కొంచెం కామెడీ అయితే సినిమాలో దొరుకుతుంది. మొత్తం మీద టైమ్ పాస్ కావాలన్నా సినిమాకు వెళ్లొచ్చు. కానీ.. సినిమాకు ఏదో ఎక్స్ పెక్టేషన్ తో మాత్రం వెళ్లకండి. ఏదో సరదాగా కాసేపు థియేటర్ లో సినిమా చూడాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 2.6 / 5
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.