Home » News » Biker Movie Review And Rating In Telugu
News

Biker Movie Review : శర్వానంద్ బైకర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 9, 2026, 7:15 pm
Advertisement

Biker Movie Review :  ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించి సూపర్ హిట్ కొట్టిన Sharwanand  శర్వానంద్, ఇప్పుడు రూటు మార్చి పూర్తి స్థాయి యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్  ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఈ మోటోక్రాస్ మూవీ ‘బైకర్’ Biker ఏప్రిల్ 3న (రేపు) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈరోజు రాత్రే ప్రీమియర్స్ పడుతుండగా.. ఇప్పటికే పూర్తయిన సెన్సార్, ప్రివ్యూ షోల ఆధారంగా అందుతున్న ఫస్ట్ రివ్యూ మీకోసం.

Advertisement

Biker Movie Review : శర్వానంద్ బైకర్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు: శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు.
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
నిర్మాతలు: విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి (యూవీ క్రియేషన్స్)
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: జే యువరాజ్
సెన్సార్ & రన్ టైమ్: U/A (13+), 2 గంటల 42 నిమిషాలు (162 నిమిషాలు)

Advertisement

Biker Movie Review  : కథ ఏమిటంటే..

ఇది మూడు తరాల కుటుంబ కథ. వికాస్ నారాయణ్‌ (శర్వానంద్) కు బైక్స్ అన్నా, బైక్ రేసింగ్ అన్నా ప్రాణం. రేసింగ్ ట్రాక్ పై పట్టు సాధించి ఛాంపియన్‌గా నిలవాలని కలలు కంటాడు. కానీ వికాస్ తండ్రి (రాజశేఖర్) కూడా ఒకప్పటి రేసరే. కొన్ని కారణాల వల్ల రేసింగ్‌కు దూరమైన ఆయన.. కొడుకు విషయంలో ఇగోతో ఉంటాడు. తండ్రికి-కొడుకు మధ్య తలెత్తిన మానసిక సంఘర్షణ ఏమిటి? తండ్రి ఇగోను దాటి, తన రేసింగ్ కలను వికాస్ ఎలా నెరవేర్చుకున్నాడు? అతడి ప్రయాణంలో భార్య పాత్ర ఏమిటి? అన్నదే ‘బైకర్’ కథ.

Biker Movie Review  విశ్లేషణ

దర్శకుడు అభిలాష్ రెడ్డి కథను స్టార్ట్ చేయడమే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మొదలుపెట్టాడు. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే కథే అయినా.. అడుగడుగునా కుటుంబ భావోద్వేగాలను జోడించి ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ప్లాన్ చేశాడు.

Advertisement

ఫస్ట్ హాఫ్: ప్రారంభ సన్నివేశాలు, విజువల్స్ ఆడియన్స్‌ను వెంటనే కథలోకి తీసుకెళ్తాయి. రియల్ రేసింగ్ ట్రాక్‌లపై చిత్రీకరించిన మోటోక్రాస్ విజువల్స్ సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ‘క్లిఫ్ జంప్’ Cliff Jump సీన్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక అందరూ ఈ స్టంట్ గురించే మాట్లాడుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో చూడని విధంగా ఇంటర్వెల్ బ్లాక్ ఉత్కంఠభరితంగా, హై-వోల్టేజ్‌తో డిజైన్ చేశారు.

సెకండ్ హాఫ్: ద్వితీయార్థం మొత్తం తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ చేత కంటతడి పెట్టిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే బైక్ రేసింగ్ సీక్వెన్స్ అయితే ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు చూడని విధంగా.. గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ.

నటీనటుల పనితీరు

శర్వానంద్: ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఏకంగా 23 కిలోల బరువు తగ్గి, సిక్స్ ప్యాక్‌తో అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ కిర్రాక్ అనిపిస్తుంది. తన కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్.

Advertisement

రాజశేఖర్: చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ఒక బలమైన క్యారెక్టర్ పడింది. వింటేజ్ రాజశేఖర్‌ను ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, సెటిల్డ్ యాక్టింగ్ సినిమాకు పెద్ద అసెట్.

మాళవిక నాయర్: కేవలం పాటలకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించింది.

సాంకేతిక వర్గం

‘బైకర్’ సినిమాకు టెక్నికల్ వాల్యూస్ వెన్నెముకగా నిలిచాయి. జిబ్రాన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా రేసింగ్ సీన్లలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ BGM సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను అందించింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంది.

Advertisement

ప్లస్ పాయింట్స్

శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ నటన

రాజశేఖర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్, తండ్రీకొడుకుల ఎమోషన్స్

క్లిఫ్ జంప్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్

క్లైమాక్స్ బైక్ రేసింగ్ సీక్వెన్సెస్

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్

మైనస్ పాయింట్స్

కథలో కొత్తదనం లేకపోవడం (కొత్త సీసాలో పాత సారా).

స్పోర్ట్స్ డ్రామా కావడంతో అక్కడక్కడా స్క్రీన్ ప్లే కాస్త స్లో అవ్వడం.

2 గంటల 42 నిమిషాల రన్ టైమ్.

చివరగా..

కథ పాతదే అయినా, దానిని ఎమోషనల్‌గా, టెక్నికల్‌గా బ్రలియంట్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్, ఎమోషన్, గూస్‌బంప్స్ ఇచ్చే రేసింగ్ సీన్లతో ‘బైకర్’ ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. శర్వానంద్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్లే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి