Hari Hara Veera Mallu First Review : హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, థియేటర్లలో పండగే !
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు” విడుదలకు ముందే సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యూనిట్ మరియు సెన్సార్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం, ఈ సినిమా పవన్ అభిమానులకు నిజమైన పండగ కానుంది. ఇప్పటివరకు ప్రేమ కథలతో, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో సూపర్ హిట్స్ అందించిన పవన్ కళ్యాణ్, ఈసారి పూర్తి భిన్నమైన పాత్రతో వచ్చారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, కోహినూర్ కోసం పోరాడే వీరమల్లు పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. ఈ కథలో యుద్ధం, దేశభక్తి, తిరుగుబాటు అన్నీ కలవడం విశేషం.
Hari Hara Veera Mallu First Review : హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, థియేటర్లలో పండగే !
సినిమా మొత్తాన్ని ముందుండి చివరి వరకు తీసుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నదే టాక్. పవన్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారీ ప్రేక్షకుల కళ్ళు ఆయనపైనే ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆయన చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో సీటీలు, చప్పట్ల పండుగ అంటూ వర్ణిస్తున్నారు.ఫైట్స్, డైలాగ్ డెలివరీ, డిజైనింగ్ అన్నింటిలోనూ పవన్ స్టైల్ మెరిపించిందని సమాచారం.
సినిమాకు మరో ప్రధాన బలం ఎంఎం కీరవాణి సంగీతం. స్క్రీన్‌పై పాటలు వినిపించే ప్రతి సన్నివేశంలో గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు.ముఖ్యంగా ‘అసుర హరణం’ పాటలో పవన్ కళ్యాణ్ హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు థియేటర్‌లో పీక్స్‌కి తీసుకెళ్తుందట.
నేపథ్య సంగీతంలోనూ కీరవాణి మార్క్ స్పష్టంగా కనిపించిందని సమాచారం. సినిమాలో భారీ విజువల్స్, నటన, సంగీతం ఆకట్టుకుంటున్నప్పటికీ…కథలో కొన్ని చోట్ల బలహీనత ఉందని,కామెడీ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని ఓ వర్గం చెబుతోంది. చరిత్ర ఆధారంగా కొందరు లాజిక్ మీద ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఇందులో పూర్తి ఫిక్షనల్ టచ్ పెట్టినట్లు చెప్పబడింది. బాబీ డియోల్ నటన మంచి ఫీడ్‌బ్యాక్ తెచ్చుకున్నప్పటికీ, ‘యానిమల్’లో కనిపించిన బ్రూటల్ మాస్‌కు ఈ క్యారెక్టర్ సరిపోతుందా? అన్నదానిపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసినట్టు సమాచారం. చరిత్రపై ఆసక్తి ఉన్నవాళ్లకు కాస్త చర్చకు అవకాశమున్నా, సినిమా ఫిక్షనల్ అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చారు. బాహుబలి స్థాయిలో కాదు కానీ… పవన్ ఫ్యాన్స్‌ను మాత్రం డిజప్పాయింట్ చేయదన్నది ఇన్‌సైడ్ టాక్.
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
Hari Hara Veera Mallu Business : Hari Hara Veera Mallu Movie Review పవన్ కళ్యాణ్ హరిహర…
This website uses cookies.