Salaar Part 1 Ceasefire Movie Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas ‘ సలార్ ‘ Salaar Movie సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కేజిఎఫ్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ prashanth neel దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కాబోతుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా రన్ టైం కూడా రెండు గంటల 55 నిమిషాలు ఉన్నట్లు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాని కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేయడం జరిగిందట.
సినిమా చూసిన వారి టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు ట్రైలర్లు చూస్తే కథ ఏమిటి అన్నది అందరికి ఒక ఐడియా వచ్చింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కోసం ఫైట్ చేయటానికి హీరో వస్తాడు. ఆ స్నేహితుడి కల నెరవేర్చిన తర్వాత అతడితో శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది సలార్ కథాంశం. అయితే మొదటి పార్ట్ లో స్నేహితుడి కోసం హీరో చేసిన పోరాటాన్ని చూపించబోతున్నారు అని అంటున్నారు. సెకండ్ పార్ట్ లో వారి మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని చూపిస్తారని టాక్. ఇక సలార్ పార్ట్ 1 రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ చాలా డీసెంట్ గా ఉంటుందట. ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటాయట.
ఇక సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ని చూపిస్తారట. అయితే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ నుండి ఉంటాయని అంటున్నారు. యాక్షన్ డోస్ ఎక్కువ అనిపించినా ప్రభాస్ ఫ్యాన్స్ ను, మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని సినిమా చూసిన ప్రముఖులు అంటున్నారు. మొత్తానికి అయితే ప్రభాస్ భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. గత సినిమాలు నిరాశపరచడంతో ఇప్పుడు ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు. ఇక రేపు విడుదల అవబోతున్న సలార్ సినిమా ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.