
Story of A Child : నన్ను వదిలేసి అమ్మ 2వ పెళ్లి చేసుకుంది అని తన బాధను వ్యక్తం చేసిన ఓ పిల్లాడు... పిల్లవాడు మాటలు విని ఏడ్చేసిన యాంకర్...!
Story of A Child : అమ్మ నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పుట్టిన దగ్గరనుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. కొందరైతే తల్లిదండ్రులు లేకుండా ఉండడానికి అసలు ఇష్టపడరు.. తల్లితండ్రులు కూడా పిల్లల్ని వదిలి ఉండడానికి అస్సలు ఇష్టం పడరు. కానీ తల్లి ఉండి కూడా ఓ పిల్లాడు హాస్టల్లో గడుపుతున్నాడు.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకట్ దాస్ పదో తరగతి చదువుతున్న కుర్రాడు తల్లిదండ్రుల గురించి తన బాధను వ్యక్తం చేశాడు..వెంకట్ దాసు ఆరో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి గుండెపోటు వచ్చి మరణించడంతో తల్లికి చిన్న వయసు కావడంతో ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేశారు.
అలా చేయడంతో వెంకట దాసు తన అమ్మమ్మ తాత దగ్గర పెరిగాడు. ఇక అమ్మమ్మ తాతయ్య ముసలి వాళ్ళ అవ్వడంతో వెంకట్ దాస్ ని హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఇక వెంకట్ దాస్ కి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. కానీ తను పెళ్లి చేసుకున్న అతను వెంకట్ దాస్ ని తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు.. ఇక ఆమె వెంకట్ దాస్ ని చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెళ్తారు. వెంకట దాసు మా అమ్మానాన్న అంటే నాకు చాలా ఇష్టం. వేరే పిల్లల తల్లితండ్రులను చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వెంకట్ దాస్ పుట్టినరోజు కి వాళ్ళ అమ్మ మ్మ గారింటికి వచ్చినప్పుడు వెంకట దాస్ వాళ్ళ తాతయ్య హాస్టల్ కి వెళ్లి వెంకట్ దాస్ ని తీసుకువచ్చి వాళ్ళ అమ్మకి ఒకసారి చూయించి మళ్లీ తీసుకెళ్లి అదే అలాగా హాస్టల్లో వదులుతాడట.
నా బాధను నేను లోపల దాచుకుంటాను. ఒకవేళ ఎక్కువ బాధ అనిపించినప్పుడు నేను సార్ కు చెప్పి మా అమ్మతో మాట్లాడతాను. అని వెంకట దాసు యాంకర్ తో బాధపడుతూ చెప్పాడు. హాస్టల్లో ఉండే ఒక ఉపాధ్యాయుడు కూడా అక్కడ ఉన్న పిల్లలందరిని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వెంకట దా స్ బాగా చదువుతాడు ప్రతి సబ్జెక్టులో 10/10 వస్తాయి తను త్రిబుల్ ఐటీ సాధించి బాసర వెళ్లాలి అనుకుంటున్నాడు అని ఆ ఉపాధ్యాయుడు తన భావనను తెలిపాడు. వెంకట్ దాస్ మాటలకి యాంకర్ కూడా ఏడ్చేసింది.. అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన వంటలు కానివ్వండి.. చేసిన పనులు వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారట. తల్లిదండ్రులు లేకుండా పెరగడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అని మనం కోరుకుందాం…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
This website uses cookies.