Kavya Maran : తొలుత తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీల జాతకాలను బయటపెడుతూ సంచలనంగా మారిన వేణు స్వామి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారుల యొక్క జాతకాలను కూడా బయటపెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త తరహాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వేణు స్వామి తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి ఆ జట్టు ఓనర్ కావ్య గురించి మాట్లాడుతూ సంచలనంగా మారారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 2024 సీజన్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఐపీఎల్ సీజన్ లో అన్ని అడ్డంకులను దాటుకొని సన్రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్ కత్తా నైట్ రైడర్స్ మాత్రమే ఫైనల్ వరకు చేరుకోగలిగారు. అయితే ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇప్పుడు ఇంతలా పుంజుకుని ఆడడానికి గల ముఖ్య కారణం హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య జాతకమేనని వేణు స్వామి తెలియజేశారు. మొన్నటి వరకు కావ్య జాతకం బాగోలేకపోవడం వలన ఆ జట్టుకు సరిగా కలిసి రాలేదని కానీ ఇప్పుడు ఆమె జాతకంలోని దోషాలను తొలగి సక్రమంగా ఉండటం వలన హైదరాబాద్ జట్టు భారీ విజయాలను నమోదు చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఐపీఎల్ 2024 లో సన్రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ఇక హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నటువంటి అభిషేక్ అనే బ్యాటర్ ను ఆపడం ఎవరి తరం కాదని అతను గ్రౌండ్ లో అడుగుపెట్టి సిక్స్ లు కొడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం తప్ప మరి ఏమి చేయలేరు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి వివరించారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. వేణు స్వామి చెప్పినట్లుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు వచ్చిందంటే ఈసారి కచ్చితంగా కప్పు కొడుతుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ 2024 కప్ ఎవరిని వరుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
This website uses cookies.