Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ని వరుస పరాజయాలు చవి చూస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓడిన ముంబై జట్టు ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌పై అంతకన్నా దారుణంగా ఓడింది .ఉత్కంఠగా సాగిన హైస్కోరింగ్ గేమ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది ఎస్ఆర్‌హెచ్ జట్టు. సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకి మంచి విజయాన్ని అందిచాడు. అయితే ముంబైకి కొత్త కెప్టెన్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా మరోసారి బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్ ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63), హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 80 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలు చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే ఎస్ఆర్‌హెచ్‌కి ముందు ఊపు తెచ్చింది హెడ్. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ బ్యాటర్.. మొత్తంగా 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతని ఊపుకి ముంబై బౌలర్స్ నోరెళ్లపెట్టి చూస్తూ ఉండిపోయారు. హెడ్‌ని ఎలా ఆపాలో పాండ్యాకి అర్ధంకాక చేతులెత్తేశాడు.ఆ సమయంలో రోహిత్ శర్మ రంగంలోకి దిగి హెడ్‌ని పెవీలియన్‌కి పంపేలా స్కెచ్ వేశాడు. హాఫ్ సైడ్ షాట్ కొట్టేలా బౌలింగ్ చేయమని కొయెట్జీకి చెప్పి అటు సైడ్ టైట్ ఫీల్డింగ్ పెట్టాడు. ఇక పాండ్యాని కూడా బౌండరీ లైన్ దగ్గరకి పంపించాడు. ఇక ఆ సమయంలో రాంగ్ షాట్ ఆడిన హెడ్ వెనుదిరగక తప్పలేదు. రోహిత్ స్కెచ్ చూసి పిచ్చోడైపోయాడు పాండ్యా .
బ్యాటర్‌ని సరిగ్గా అంచనా వేయడం, కరెక్ట్ ప్లానింగ్, బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా చేయడం, బౌలర్‌కు ఔట్ చేయగలవనే ధీమా ఇవ్వడం ఇవన్ని చూసి పాండ్యా మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. అతని కెప్టెన్సీని చూసి కామెంటేటర్స్ కూడా ప్రశంసలు కురిపించారు. మరి రోహిత్ కెప్టెన్సీలో ఉట్టిగానే 5 కప్పులు వచ్చయా అని నెటిజన్స్ అంటున్నారు.ఇప్పటికైన తిరిగి రోహిత్‌కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని, లేదంటే ముంబై జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా పోదని చెబుతున్నారు.ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపునతిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. టీమ్ డేవిడ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) రాణించాడు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.