Hardik Pandya Vs Shubman Gill : హార్ధిక్, గిల్ మధ్య కోల్డ్ వార్.. బయటపడిన వీడియో..!
Hardik Pandya Vs Shubman Gill : ఐపీఎల్ IPL 2025 అంటేనే ఒక్కొక్కరిలో కసి అలా తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకు బాగా కావాల్సిన వాళ్ల మీద తెలియకుండానే కోపం కసి వచ్చేస్తాయి. అలా ఈ ఏడాది ఐపీఎల్ ఇద్దరు శత్రువులను తయారు చేసిందా. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ఈ ఇద్దరికీ ఇప్పుడు పడటం లేదంటూ నిన్న మ్యాచ్ లో జరిగిన ఘటనలను వైరల్ చేస్తున్నారు.
Hardik Pandya Vs Shubman Gill : హార్ధిక్, గిల్ మధ్య కోల్డ్ వార్.. బయటపడిన వీడియో..!
Hardik Pandya Vs Shubman Gill ఏంటి గొడవ..
ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ముంబై, గుజరాత్ కెప్టెన్లు ఇద్దరూ టాస్ కి వచ్చారు. టాస్ ముంబైకెప్టెన్ పాండ్యా గెలిచాడు. ఇది నచ్చలేదో ఏమో జనరల్ గా టాస్ ఎవరూ గెలిచినా మాట్లాడటానికి వెళ్లే వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది ఆనవాయితీ . కానీ నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేదు శుభ్ మాన్ గిల్. పాండ్యా షేక్ హ్యాండ్ ఇద్దామని చేయి లేపేందుకు చూస్తున్నా గిల్ అస్సలు ఆసక్తి చూపలేదు.
అది మనసులో పెట్టుకున్నాడేమో ఛేజింగ్ టైమ్ లో గిల్ మొదటి ఓవర్ లోనే ఔట్ కాగానే గిల్ పక్కకు వచ్చి పెద్దగా అరుస్తూ ఏదో అన్నాడు పాండ్యా. గిల్ కూడా సీరియస్ గా చూశాడు. ఈ సీజన్ అంతా అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకూ టేబుల్ టాపర్ గా కూడా ఉన్నా గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఎలిమినేటర్ లో ఓడి ఎలిమినేట్ అయిపోయింది. మరి ఆ కోపం కసితో అలా ప్రవర్తించాడో ఏమో తెలియదు కానీ మ్యాచ్ లో కామేంటేటర్లు కూడా వీళ్లిద్దరి మధ్య జరిగిన సీన్స్ ని చూపిస్తూ మినీ రైవల్రీ అని చెప్పుకురావడం కొసమెరుపు.
