Home » News » Intresting Scene Ipl 2022
News

IPL 2022 : రివ‌ర్స్ సీన్.. ఐపీఎల్ మ్యాచ్‌లో అబ్బాయికి ప్రపోజ్ చేసిన అమ్మాయి

Authored By
Sam C
The Telugu News | Published on: May 5, 2022, 2:30 pm
Advertisement

IPL : ఐపీఎల్ 2022లో ఆస‌క్తిక‌ర ఫైట్ సాగుతున్న విష‌యం తెలిసిందే. నిన్న (బుధవారం) చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా జరిగింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ జట్టే.. మ్యాచ్‌ లో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్‌ ను చేధించడంలో ధోనీ సేన విఫలమైంది. దీంతో 13 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు విక్టరీ కొట్టింది. అయితే ఇదిలా ఉంటే గ్రౌండ్‌ లో మ్యాచ్‌ జరుగుతుంటే.. స్టాండ్స్‌ లో ఓ అమ్మాయి ఆర్సీబీ ఫ్యాన్‌ అయిన ఓ అబ్బాయికి లవ్‌ ప్రపోజ్‌ చేసింది.ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఆర్‌సీబీ జెర్సీతో ఉన్న యువకుడు ఓ యువతి స్టేడియంలోనే ఒక్కటయ్యారు.

Advertisement

యువతి మోకాళ్లపై నిల్చొని బాయ్ ఫ్రెండ్‌కి ప్రపోజల్ చేయడంతో అక్కడున్న వాళ్లంతా స్టన్నయ్యారు. ఈ సన్నివేశం మన కెమెరా మ్యాన్ కంట పడటంతో ప్రపోజల్ సీన్ అయ్యే వరకూ వాళ్లను లైవ్‌లో చూపిస్తూనే ఉన్నాడు. ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడంతో.. ఆ యువతి రింగ్‌ను యువకుడి వేలుకు తొడిగి.. హగ్‌తో సంబరాలు చేసుకుంది. అయితే, ఈ జంట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీరికి నెటిజన్స్ విషెస్ చెబుతూ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారుటార్గెట్‌ ఛేజింగ్‌ లో భాగంగా సీఎస్‌కే బ్యాటింగ్‌ చేస్తున్న 11వ ఓవర్లో ఈ లవ్‌ ప్రపోజల్‌ సీన్‌ జరిగింది. సీఎస్‌కే ఆటగాడు కాన్వే బ్యాటింగ్‌ చేస్తుండగా.. హసరంగా బౌలింగ్‌ చేస్తున్నాడు.

intresting scene ipl 2022

Advertisement

IPL2022 : గొప్ప అనుభూతి..

అప్పుడే ఆఫ్‌ ద గ్రౌండ్‌ లో ఓ అమ్మాయి ఓ అబ్బాయికి మోకాళ్లపై కూర్చోని లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజ‌న్స్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌ముఖ క్రికెట‌ర్ వ‌సీం జాఫర్ కూడా స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసాడు.జయాపజయాలతో సంబంధం లేకుండానే.. ఓన్లీ కోహ్లీ మార్క్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని సొంతం
చేసుకుంది. కోహ్లీ ఎంత డిఫరెంటో.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా అంతే డిఫరెంట్. అచ్చూ కోహ్లీలా వాళ్లు ఏది చేసినా వెరైటీ.. ట్రెండింగే. ఇలా ప్రేమ వ్య‌వ‌హారం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి