Home » News » Ipl 2025 Postponed Indefinitely Bcci Takes Major Decision
News

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 9, 2025 2:14 pm
Advertisement

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. అభిమానులు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed ఐపీఎల్ ర‌ద్దు..

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. గురువారం (మే 8) ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేయబడిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలు పాకిస్థాన్ నుంచి దాడికి గురవుతున్నందున రద్దు చేయబడింది.

Advertisement

భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మొత్తం సీజన్‌ నిలిపివేయబడిందా లేదా తరువాత తేదీకి మార్చబడుతుందా అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం రాత్రే తెలిపారు .

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి