Home » News » Kavya Maran Did Sunrisers Hyderabad Make A Huge Mistake
News

kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: April 12, 2025 4:39 pm
Advertisement

kavya Maran : గ‌త ఏడాది అద్భుత ప్ర‌ద‌ర్శిన క‌న‌బ‌ర్చిన స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో మాత్రం చెప్పుకోద‌గ్గ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చ‌డం లేదు. అయితే వేలంలో కావ్య పాప చేసి పెద్ద త‌ప్పిదం వ‌ల్లే ఇలా అంటున్నారు. మెగా వేలానికి ముందు ఏకంగా ఐదుగురు ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ రీటెయిన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ కమిన్స్, ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలను రీటెయిన్ చేసుకుంది.

Advertisement

kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..!

kavya Maran అలా ఎలా ?

ఇక వేలంలో ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ లను కొనుగోలు చేసింది. అయితే ఇద్దరి విషయంలో మాత్రం తప్పు చేసింది. 2022 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లను మెగా వేలానికి ముందు వేలంలోకి వదులుకుంది. వేలంలో వీరిద్దరు రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చారు. మొదట మార్క్రమ్ రాగా.. ఎవరు కొనే ప్రయత్నం చేయలేదు.

Advertisement

చివరకు లక్నో బిడ్ వేసి కేవలం 2 కోట్లకే సొంతం చేసుకుంది. ప్రస్తుతం మార్క్రమ్ బాగా ఆడుతున్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ కూడా బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. అయితే మొదట ఇతడిని ఎవరూ కొనలేదు. దాంతో అన్ సోల్డ్ గా మిగిలాడు. అయితే చివర్లో మళ్లీ వేలంలోకి రాగా.. గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. మార్క్రమ్ ను తీసుకొని ఉంటే.. బ్యాటింగ్ లో నిలకడ ఉండేది. ఇక బౌలింగ్ కూడా వేసేవాడు.. గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్ ప్లేయర్ గా ఉండేవాడు. రూ.4 కోట్ల‌కి కక్కుర్తి ప‌డి కావ్య పెద్ద త‌ప్పే చేసింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి