Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక నటాషా మళ్లీ ప్రేమలో పడిందా.. అమ్మడి సమాధానం ఏంటి?
Natasa Stankovic : ఇటీవల బ్రేకప్‌ల గురించి ఎక్కువగా వింటున్నాం. ప్రేమలో పడడం తిరిగి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో Hardik Pandya ఆమె 2024లో జులైలో విడిపోయారు. కొంతకాలంగా నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి.
Natasa Stankovic : హార్ధిక్ నుండి విడిపోయాక నటాషా మళ్లీ ప్రేమలో పడిందా.. అమ్మడి సమాధానం ఏంటి?
ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్ గా కనిపించడంతో ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. తాజాగా, మళ్లీ ప్రేమలో పడ్డారా? అన్న ప్రశ్నకు నటాషా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ మళ్లీ ప్రేమలో పడడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు. నమ్మకం, అవగాహనతో నిర్మితమైన అర్థవంతమైన సంబంధాలకు నేను విలువ ఇస్తాను. ప్రేమ నా ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను, అంతకుమించి ప్రేమ గురించి నిర్వచించలేం అని తెలిపారు. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని నటాషా చెప్పారు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మరింత రాటుదేలుతామని చెప్పుకొచ్చింది.
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
This website uses cookies.