Home » News » Netigens Fire On Sania Mirza
News

Sania Mirza : సానియా మీర్జా ఇలా ఇరుక్కుందేంటి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్స్..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 13, 2025, 6:00 pm
Advertisement

Sania Mirza : పాకిస్తాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది.. భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర దాడుల మధ్య, సానియా మీర్జా చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో పోస్ట్‌ను షేర్ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

Advertisement

Sania Mirza : సానియా మీర్జా ఇలా ఇరుక్కుందేంటి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్స్..!

Sania Mirza సానియాపై ఆగ్ర‌హం..

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత గురించి ఆమె గతంలో చేసిన పోస్ట్‌లో, సానియా .. ప్రతి ఒక్కరూ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతో సమస్యలకు చరమగీతం పాడాలన్నారు. సంభాషణ బలహీనత కాదు, శాంతి ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గాజా నుండి ఇజ్రాయెల్ వరకు, పుల్వామా నుండి పహల్గామ్ వరకు, రష్యా నుండి ఉక్రెయిన్ వరకు అంటూ శాంతి మంత్రం పఠించాలని తన పోస్ట్ లో ” సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Advertisement

సానియా పోస్ట్ పై నెటిజన్స్ సానియాను దుమ్మెత్తి పోస్టూ ట్వీట్స్ చేశారు. పాకిస్తాన్ మాజీ కోడలు భారతదేశానికి శాంతి పాఠం చెబుతోందంటూ దుయ్యబట్టారు. . భారతదేశం, పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ ప్రకటించాయని ఆమె చేతితో మూసి ఉన్న ఎమోజీని పోస్ట్ చేసింది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరు ఆమె మాజీ భర్త పాకిస్థాన్ లో ఉన్నా.. అతని దేశం పట్ల సానియాకు ప్రేమ తగ్గలేదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి