Home » News » Pakistan Beats Usa By 32 Runs Sahibzada Farhan Shines
News

PAK vs USA: అమెరికా భరతం పట్టిన పాక్ స్పిన్నర్లు.. 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 10, 2026, 11:24 pm
Advertisement

PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా USA పై పాకిస్తాన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత ప్రపంచ కప్‌లో అమెరికా చేతిలో ఎదురైన పరాభవానికి పాకిస్తాన్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాకిస్తాన్ గ్రూప్-A పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Advertisement

PAK vs USA: అమెరికా భరతం పట్టిన పాక్ స్పిన్నర్లు.. 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం!

PAK vs USA : సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం మెరుపులు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ Sahibzada Farhan అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 41 బంతుల్లోనే 73 పరుగులు (స్ట్రైక్ రేట్ 178) చేసి పాకిస్తాన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.

Advertisement

మరోవైపు కెప్టెన్ బాబర్ ఆజం Babar Azam 32 బంతుల్లో 46 పరుగులతో రాణించగా, చివర్లో షాదాబ్ ఖాన్ Shadab Khan కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ Shadley van Schalkwyk 4 వికెట్లు తీసి పాక్ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

PAK vs USA : పాక్ స్పిన్నర్ల దెబ్బకు విలవిలలాడిన అమెరికా

191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ షాయన్ జహంగీర్ (49 పరుగులు), శుభమ్ రంజనే (51 పరుగులు) పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

Advertisement

పాకిస్తాన్ స్పిన్నర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఉస్మాన్ తారిఖ్ Usman Tariq 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీసి అమెరికా పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ బౌలింగ్ దాడి ముందు అమెరికా మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో ఓటమి తప్పలేదు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

అద్భుతమైన బ్యాటింగ్‌తో 73 పరుగులు చేసి పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాహిబ్జాదా ఫర్హాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోర్లు:

పాకిస్తాన్: 190/9 (20 ఓవర్లు) – సాహిబ్జాదా ఫర్హాన్ 73, బాబర్ ఆజం 46; షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 4/25.

అమెరికా: 158/8 (20 ఓవర్లు) – శుభమ్ రంజనే 51, షాయన్ జహంగీర్ 49; ఉస్మాన్ తారిఖ్ 3/27.

Advertisement

 

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి