sania mirza and shoaib malik divorce confirmed
Sania Mirza – Shoaib Malik Divorce : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మళ్లీ తెరమీదికి వచ్చింది. వీళ్లు విడాకులు తీసుకొంటున్నారని ఆ మధ్యనే వార్తలు తెగ షికార్లు చేశాయి. కానీ.. తమ విడాకులపై సానియా మీర్జా కీన.. షోయబ్ కానీ ఏనాడూ స్పందించలేదు. వీళ్లిద్దరూ అసలు విడిపోయారా లేక కలిసే ఉంటున్నారా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. 2010లో వీళ్ల పెళ్లి జరిగింది. సానియా మీర్జాకు అంతకుముందే హైదరాబాద్ కే చెందిన ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం జరిగి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సానియా, షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్ల జీవితం సాఫీగానే సాగింది. కానీ.. గత రెండేళ్ల నుంచి మాత్రం వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి.
ఇద్దరి సోషల్ మీడియా పేజీలలోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేను కమ్యూనికేషన్ లో ఉంటేనే శ్రద్ద చూపిస్తా.. నిశ్శబ్దంగా ఉంటే నేను కూడా పట్టించుకోను అంటూ సానియా మీర్జా తన సోషల్ మీడియా పేజీలో రాసుకుంటూ రావడంతో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అనే వార్తలు నెట్టింట్లో షికార్లు చేస్తున్నారు. అందుకే సానియా అలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు. కానీ… సానియా మీర్జా కానీ.. షోయబ్ కానీ వీళ్ల విడాకుల మ్యాటర్ పై మాత్రం స్పందించలేదు. వీళ్లకు 2018 లో ఒక బాబు పుట్టాడు.
sania mirza and shoaib malik divorce confirmed
వీళ్లు విడాకులు తీసుకుంటున్నారు కాదు.. విడాకులు తీసుకున్నారు అంటున్నారు. సానియా మీర్జాకు సంబంధించిన పలు విషయాలను షోయబ్ మాలిక్ తన సోషల్ మీడియా అకౌంట్లలో నుంచి తీసేశారు. తన బయోలో సానియా గురించిన వివరాలను తీసేశాడు. సానియా మీర్జా మాత్రం షోయబ్ తో దిగిన ఫోటోలను మాత్రం ఎప్పుడో తీసేసింది. తన కొడుకుతో ఉన్న ఫోటోలనే ఉంచుకుంది. మరి.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదానిపై క్లారిటీ రావాలంటే వాళ్లే ప్రకటించాలి.
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ…
This website uses cookies.