
Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి రనౌట్ చేసిన సంజూ శాంసన్.. రెండు కళ్లు సరిపోవు
Sanju Samson : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మంచి రసవత్తరంగా సాగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంది. శనివారం (ఏప్రిల్ 03) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు సంజూ శాంసన్ సేన చెమటోడాల్సి వచ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులు రాజస్థాన్‌కి టార్గెట్ విధించింది. అయితే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వెంటవెంటనే వెనుదిరగడంతో లక్ష్య చేధన కాస్త కష్టమైంది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించిన చివరిలో హెట్‌మయర్ (27*) రాణించడంతో గెలిచింది.
అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కళ్లు చెదిరే రనౌట్‌తో అందరిని ఆశ్చర్యపరిచడు. వెటరన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ వికెట్ కీపింగ్‌తో అదరహో అనిపించాడు. . సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌కు పంజాబ్ కింగ్స్ డేంజరస్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో యుజ్వేంద్ర చాహల్ వేసిన 18వ ఓవర్ వేస్తున్నాడు. అయితే ఈ ఓవర్ ఐదో బంతిని పుల్ టాస్‌గా వేయగా.. అషుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. లివింగ్ స్టోన్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించగా.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసిన అషుతోష్ శర్మ నిరాకరించాడు.
Sanju Samson : ధోని మార్క్ వికెట్ కీపింగ్ చేసి రనౌట్ చేసిన సంజూ శాంసన్.. రెండు కళ్లు సరిపోవు
అయితే అప్పటికే సగం పిచ్ వరకు వచ్చిన లివింగ్ స్టోన్ యూటర్న్ తీసుకోగా.. తనూష్ కోటియన్ త్రోను అద్భుతంగా అందుకున్న సంజూ శాంసన్.. ధోనీ తరహాలో బంతిని క్షణాలలో వికెట్లవైపు విసిరేసాడు. బంతిని చూడకుండా వికెట్లను హిట్ చేసి లివింగ్ స్టోన్ ని బయటకు పంపించాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. మరో ధోని అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నార. అప్పటి వరకు దూకుడుగా ఆడిన లివింగ్ స్టోన్ కాసేపు క్రీజులో ఉంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఆటగాడిని తన మెరుపు ఫీల్డింగ్‌తో ఔట్ చేయడం పట్ల ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.