Home » News » Srh Warning Cm Revanth Reaction
News

SRH హెచ్చరిక .. సీఎం రేవంత్ రియాక్షన్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: March 31, 2025 11:26 pm
Advertisement

SRH  : ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad (SRH) మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య టికెట్ల వివాదం తీవ్రతరం అయ్యింది. SRH యాజమాన్యం, హెచ్‌సీఏపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అనుచిత ప్రవర్తనతో పాటు బెదిరింపులకు గురిచేసిందని పేర్కొంది. ఉచిత పాస్‌ల విషయంలో అసోసియేషన్ అధికారి జగన్మోహన్ రావు అనవసర ఒత్తిడి తీసుకువస్తున్నారని SRH జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ లేఖ ద్వారా వివరించారు. గత కొన్ని సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని SRH ఆరోపించింది.

Advertisement

SRH హెచ్చరిక .. సీఎం రేవంత్ రియాక్షన్..!

ఇది ఇలా కొనసాగితే హైదరాబాద్ నుంచి తమ జట్టు మారిపోయే అవకాశముందని హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 50 కాంప్లిమెంటరీ టికెట్లు అందజేస్తున్నామని కానీ దీనికంటే అధిక డిమాండ్ రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని SRH పేర్కొంది. హైదరాబాద్ జట్టును వదిలివెళతామని వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన రేపుతున్నాయి.

Advertisement

ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. SRH యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరించిందనే ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె. శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని సీఎం సూచించారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణలో అసోసియేషన్ దుర్వినియోగం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి