Team India : టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ స్టేజ్ జూన్ 17న బంగ్లాదేశ్, నేపాల్.. శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ముగిసింది. బుధవారం (జూన్ 19) నుంచి సూపర్ 8 స్టేజ్ ప్రారంభం అవుతుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తంగా 20 టీమ్స్ పాల్గొనగా, వీటిలో 12 టీమ్స్ లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టాయి.. 8 టీమ్స్ తర్వాతి రౌండ్ కు వెళ్తాయి. అక్కడ ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి ఆడిస్తారు. వాటిలో నుంచి నాలుగు టీమ్స్ సెమీఫైనల్స్ వెళ్తాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి.
సూపర్ 8 స్టేజ్ లో ఎనిమిది టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ఉంటాయి. గ్రూప్ 2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, యూఎస్ఏ ఉన్నాయి. లీగ్ స్టేజ్ లాగే ఈ జట్లన్నీ తమ గ్రూపులోని ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఆ లెక్కన సూపర్ 8లో ఇండియా.. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ తోపాటు బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంటుంది. బుధవారం (జూన్ 19) యూఎస్ఏ, సౌతాఫ్రికా మధ్య ఆంటిగ్వాలో మ్యాచ్ తో సూపర్ 8 స్టేజ్ ప్రారంభం కానుంది.అయితే ఈ సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు అక్కడి వాతావరణ శాఖ రిపోర్ట్స్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సీడబ్ల్యూఐ)ను కలవరపెడుతున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చేయుతనిచ్చేందుకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను ఇచ్చింది.
టీ20 ప్రపంచకప్ 2024లోని సూపర్ 8 మ్యాచ్‌లన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 20న భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగే ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడనుంది.ఈ స్టేడియంలో జరిగే ఇతర మ్యాచ్‌ల సమయంలో 40 నుంచి 55 శాతం వర్షం పడే అవకాశం ఉంది. సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మైదానంలో జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఆంటిగ్వా స్డేడియం వేదికగా జరిగే మ్యాచ్ సమయంలోనూ 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. సూపర్8లో దాదాపు 80 శాతం మ్యాచ్‌లపై వర్షం ప్రభావం ఉండనుంది.సూపర్-8 మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపితే నాకౌట్ చేరే జట్లు తారుమారయ్యే అవకాశం ఉంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.